Breaking News

4 మెయిల్స్, 15 కాల్స్, 45 మెసేజస్: ఇంటర్వూ క్యాన్సిల్

Published on Mon, 05/19/2025 - 21:16

సాధారణంగా ఒక ఉద్యోగానికి అప్లై చేసుకుంటే.. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లేదా ఆ కంపెనీకి చెందిన రిక్రూటర్ కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఓ అభ్యర్థి.. తనకు పదేపదే కాల్స్ వస్తున్నాయని, ఏకంగా ఒక గ్లోబల్ కంపెనీ ఇంటర్వ్యూనే వద్దనుకున్నాడు. దీనికి సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నేను ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకున్నాను అనే శీర్షికతో.. ఓ రెడ్డిట్ పోస్ట్‌ వైరల్ అవుతోంది. ఇందులో.. సోమవారం నుంచి బుధవారం మధ్య, రిక్రూటర్ నాలుగు ఈమెయిల్స్ పంపారు, 15 ఫోన్ కాల్స్ చేశారు. 45 టెక్స్ట్ మెసేజస్ చేశారు. కొన్ని మెసేజస్ రాత్రి 10 గంటల సమయంలో కూడా వచ్చాయి. అప్పటికే రిక్రూటర్‌తో మూడుసార్లు మాట్లాడాను, అవసరమైన మొత్తం సమాచారాన్ని ఈ మెయిల్ ద్వారా షేర్ చేశాను. నేను బిజీగా ఉన్నప్పుడు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒకసారి నాకు వచ్చిన ఫోన్ నెంబరుకు తిరిగి కాల్ చేస్తే.. మరెవరో సమాధానం ఇచ్చారు. దీంతో నాకు వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించింది.

వాళ్ళ ప్రవర్తనతో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకోవాలనిపించింది. ఆ తరువాత నేరుగా ఇంటర్వ్యూ చేసేవారికి ఈ మెయిల్ చేసాను. రిక్రూటర్‌ను బ్లాక్ చేయడానికి ముందు కూడా నాకు రెండు కాల్స్ వచ్చాయని ఆ ఉద్యోగార్థి (అభ్యర్థి) పేర్కొన్నారు. వల్ల ప్రవర్తన నన్ను అతిపెద్ద కంపెనీలలో ఒకదానికి పూర్తిగా దూరం చేసిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. నెటిజన్లు కూడా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. రిక్రూటర్ మోసగాడేమో అని ఒకరు సందేహపడగా.. వారు రిక్రూటర్‌గా కాకుండా టెలిమార్కెటర్‌గా ఉండి ఉంటే బాగుండేదని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)