Breaking News

వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగిని చేసిన పనికి..

Published on Thu, 08/10/2023 - 12:20

Work From Home: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచములోని చాలా దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home) వెసులుబాటు కల్పించాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా దీనికే అలవాటుపడిన ఎంప్లాయిస్ ఆఫీసులకు రావడానికి ససేమిరా అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు పనిని సక్రమంగా నిర్వహించడం లేదని కంపెనీలు వాపోతున్నాయి. ఇటీవల ఒక కంపెనీ తమ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసి వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఇన్సూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్ (IAG) కన్సల్టెంట్ 'సుజీ చీఖో' వర్క్ ఫ్రమ్ హోమ్‌లో సరిగ్గా విధులు నిర్వహించడం లేదని ఈ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటి నుంచి పనిచేసే సమయంలో సరిగ్గా టైపింగ్ చేయలేదని, అసలు ఆమెకు టైపింగ్ రాదనీ కంపెనీ వెల్లడించింది.

సుజీ చీఖో పనితీరుని పసిగట్టడానికి 49 రోజుల పాటు కీస్ట్రోక్ టెక్నాలజీని ఉపయోగించింది. దీంతో ఆమె చాలా తక్కువ కీస్ట్రోక్ యాక్టివిటీని కలిగి ఉన్నట్లు కనిపెట్టింది. అంతే కాకుండా 47 రోజులు వర్క్ ఆలస్యంగా ప్రారంభించినట్లు, 29 రోజులు సమయం కంటే త్వరగా లాగవుట్ చేసినట్లు, మొత్తం మీద 44 రోజులు కంపెనీ నిర్దేశించిన పూర్తి సమయం పనిచేయలేదని కనుక్కుంది. మిగిలిన రోజులు అసలు పనే చేయకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన - వరుసగా మూడో సారి..

సుజీ చీఖో పనితీరు సరిగ్గా లేదని కంపెనీ చాలా సార్లు గట్టిగా హెచ్చరించింది. పర్ఫామెన్స్ మెరుగుపరచుకోవాలని మూడు నెలలు సమయం కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు కనిపించలేదు. అంతే కాకుండా కంపెనీ ట్రాకింగ్‌ను తప్పుపట్టడమే కాకుండా.. తాను సరైన విధంగా పనిచేస్తున్నట్లు, ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో కాకుండా వేరే డివైజులో పనిచేస్తున్నట్లు వాదించింది. ఆమె వాదనను ఫెయిర్ వర్క్ కమిషన్ (FWC) తిరస్కరించింది. అయితే కొన్ని కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి మంగళం పాడాయి.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)