Breaking News

జియో హాట్‌స్టార్‌ ఆవిష్కరణ.. ఇకపై ఐపీఎల్‌ ఫ్రీ కాదు!

Published on Fri, 02/14/2025 - 13:08

రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ కంపెనీల అనుబంధ సంస్థలుగా ఉన్న జియోస్టార్, జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్లను పరస్పరం విలీనం చేస్తూ సమగ్ర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ‘జియో హాట్‌స్టార్‌(JioHotStar)’ను అధికారికంగా ప్రారంభించారు. ఈ విలీనంతో దేశంలోని తమ వినియోగదారులకు వినోదం, క్రీడలతోపాటు మరెన్నో ఎంటర్‌టైన్‌మెంట్‌ సదుపాయాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరు సంస్థల అధికారులు తెలిపారు.

సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ ఇలా..

జియో హాట్ స్టార్ హైబ్రిడ్ సబ్ స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం హాలీవుడ్ సినిమాలు మినహా ప్రతి నెలా పరిమిత గంటల పాటు వినియోగదారులు కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. అంతకుమించి వీక్షించాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఐపీఎల్‌ను జియో, హాట్‌స్టార్‌లు ఫ్రీగా అందించేవి. కానీ మ్యాచ్‌ను పూర్తిగా వీక్షించాలంటే మాత్రం ఇకపై ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రకటనలతో కేవలం మొబైల్‌ మాత్రమే వీక్షించాలంటే త్రైమాసికానికి రూ.149 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. యాడ్-ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ త్రైమాసికానికి రూ.499గా నిర్ణయించారు. రెండు డివైజ్‌లకు సపోర్ట్‌ చేసేలా రెండు సూపర్‌ ప్లాన్ల(యాడ్‌ బేస్‌)ను తీసుకొచ్చింది. దీనికి త్రైమాసికానికి ధర రూ.299. ఏడాదికి రూ.899 చెల్లించాలి. ప్రకటనలు లేకుండా కంటెంట్‌ వీక్షించాలంటే ఏడాది వ్యాలిడిటీ ప్లాన్‌ ధర రూ.1499గా నిర్ణయించారు.

ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం

జియో సినిమా, డిస్నీ + హాట్‌స్టార్‌లను ప్రస్తుతం వాడుతున్న చందాదారులు జియో హాట్‌స్టార్‌కు మారుతారు. జియో సినిమా ప్రీమియం చందాదారులు తమ ప్లాన్‌ల మిగిలిన కాలవ్యవధి కోసం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రైబర్లు మూడు నెలలపాటు అదే ప్లాన్‌లో కొనసాగి తర్వాత జియో హాట్‌స్టార్‌కు మారే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: యాప్ స్టోర్‌లో టిక్‌టాక్‌ పునరుద్ధరణ!

జియో హాట్‌స్టార్‌లో కంటెంట్..

  • డిస్నీ, ఎన్‌బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, హెచ్‌బీఓ, పారామౌంట్.

  • ప్రాంతీయ, బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు.

  • ఎక్స్‌క్లూజివ్‌ ఒరిజినల్స్ అండ్ రియాలిటీ షోలు, డ్రామా, థ్రిల్లర్స్, ఎంగేజింగ్ రియాలిటీ కంటెంట్.

  • ఐపీఎల్, డబ్ల్యుపీఎల్, ఐసీసీ ఈవెంట్లు వంటి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్లు, ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ, ఐఎస్ఎల్ వంటి ప్రపంచ క్రీడా ఈవెంట్లు.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)