Breaking News

వ్యూయర్‌షిప్‌లో జియోహాట్‌స్టార్‌ కొత్త రికార్డులు

Published on Sun, 03/16/2025 - 02:52

న్యూఢిల్లీ: దేశీయంగా లైవ్‌ స్పోర్ట్స్‌ స్ట్రీమింగ్‌ వ్యూయర్‌షిప్‌లో జియోహాట్‌స్టార్‌ కొత్త రికార్డులు నెలకొల్పింది. ఇటీవల ముగిసిన ‘ఐసీసీ పురుషుల క్రిక్రెట్‌ చాంపియన్స్‌ ట్రోఫీ 2025’ మ్యాచ్‌లకు సంబంధించి 540 కోట్ల వ్యూస్, దాదాపు 11,000 కోట్ల నిమిషాల వాచ్‌టైమ్‌ నమోదైంది. డిస్నీ స్టార్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్‌ 18 విలీనంతో జియోహాట్‌స్టార్‌ ఏర్పాటైన తర్వాత స్ట్రీమ్‌ చేసిన తొలి భారీ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఇది.

ఇందులో న్యూజిల్యాండ్‌ మీద భారత్‌ గెల్చిన ఫైనల్‌ మ్యాచ్‌కి ఏకంగా 124.2 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. ఒక దశలో, ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య 6.12 కోట్లుగా నమోదైంది. గతంలో డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన 2023 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ని అత్యధికంగా 5.9 కోట్ల మంది వీక్షించారు.

తాజా టోర్నిలో భారత్‌–పాకిస్తాన్‌ మ్యాచ్‌కు 60.2 కోట్ల స్ట్రీమింగ్‌ వ్యూస్‌ వచ్చాయి. భారత్‌లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు పెరుగుతున్న ఆదరణను తాజా గణాంకాలు సూచిస్తున్నాయని జియోస్టార్‌ డిజిటల్‌ సీఈవో కిరణ్‌ మణి తెలిపారు. ఐసీసీ టోర్నమెంటును తొలిసారిగా తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లోను, సైన్‌ ల్యాంగ్వేజ్‌లోను, ఆడియో కామెంటరీ రూపంలోనూ అందించినట్లు వివరించారు.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)