Breaking News

జియోహాట్‌స్టార్‌లో వాయిస్ స్ట్రీమింగ్

Published on Thu, 02/19/2026 - 17:57

దశాబ్ద కాలంగా డిజిటల్ వినోదం అంటే.. కేవలం బ్రౌజ్ చేయడం, క్లిక్ చేయడం, అందులోని కంటెంట్‌ను వీక్షించడం మాత్రమే. కానీ ప్రస్తుతం ఆ పద్ధతి మారుతోంది. భారతదేశపు అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ చేతులు కలిపాయి. చాట్‌జీపీటీ వాయిస్ అసిస్టెంట్‌(మల్టీలింగువల్ కాగ్నిటివ్ సెర్చ్)తో వినోదాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, సంభాషణల ద్వారా కంటెంట్‌ను వెతికే వినూత్న సదుపాయాన్ని ప్రారంభించాయి.

ఇకపై యూజర్లు మెనూల్లో వెతకడం లేదా కీవర్డ్స్‌తో టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఏం చూడాలి? అనే తడబాటు లేకుండా కేవలం సహజమైన భాషలో మాట్లాడితే చాలు. ఓపెన్‌ఏఐ ఏపీఐలను ఉపయోగించి పనిచేసే ఈ వాయిస్ ఇంటర్‌ఫేస్ మీరు చెప్పే మూడ్, సందర్భం, భాషను అర్థం చేసుకుని కచ్చితమైన సలహాలను ఇస్తుంది.

ఉదాహరణకు ‘మా అమ్మనాన్నలు వస్తున్నారు, మేమంతా కలిసి చూడగలిగే సినిమా ఏదైనా సూచించు’ లేదా ‘మేము కవలలం, కవలల మీద వచ్చిన సినిమాలే మాకు కావాలి’ అని మనం అడగవచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన, సాంస్కృతిక అంశాలతో కూడిన ప్రశ్నలను కూడా ఈ ఏఐ చాట్‌బాట్ సులభంగా అర్థం చేసుకొని అందుకు తగిన కంటెంట్‌ను మీ ముందు ఉంచుతుంది.

కేవలం సినిమాలు, సిరీస్‌లు మాత్రమే కాకుండా లైవ్ స్పోర్ట్స్ చూసేటప్పుడు కూడా ఈ అసిస్టెంట్ సహాయపడుతుంది. స్కోర్లు, ప్లేయర్ హైలైట్స్, కీలక అంశాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం కేవలం జియోహాట్‌స్టార్ యాప్‌కే పరిమితం కాకుండా, నేరుగా చాట్‌జీపీటీ యాప్‌లో ఎవరైనా వినోదం గురించి సెర్చ్ చేసినప్పుడు జియోహాట్‌స్టార్‌లోని కంటెంట్‌కు సంబంధించిన లింక్‌లు అక్కడ కూడా కనిపిస్తాయి.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)