Breaking News

రూల్స్‌ మార్చరూ.. ట్రాయ్‌కు జియో విన్నపం

Published on Fri, 11/14/2025 - 16:49

5జీ సాంకేతికత రాకతో అంతర్జాతీయంగా మార్కెట్లలో మార్పులు, టెక్నాలజీ పురోగతికి అనుగుణంగా నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలను సడలించాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని రిలయన్స్‌ జియో కోరింది. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణతో, గేమింగ్‌ కోసం తక్కువ లేటెన్సీ ఉండే విధంగా, అప్‌లోడ్స్‌ కోసం వేగం ఎక్కువగా ఉండేలా వివిధ అవసరాలకు తగ్గ వేగంతో ఇంటర్నెట్‌ లభ్యత ఉండేలా ప్రోడక్టులను రూపొందించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని వివరించింది.

బ్రిటన్‌ నియంత్రణ సంస్థ ఆఫ్‌కామ్‌ కూడా ప్రత్యేక సర్వీసులు, ప్రీమియం నాణ్యత గల ఇంటర్నెట్‌ సర్వీసులను అందించేందుకు అనుమతిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా కఠినతరమైన నిబంధనలను సడలించాలని కోరింది. జియో, ఎయిర్‌టెల్‌లాంటి ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ఏ ఒక్క యాప్, వెబ్‌సైట్‌ లేదా సర్వీసులపై పక్షపాతం చూపకుండా అన్నింటినీ ఒకే దృష్టితో చూస్తూ, ఒకే రకమైన వేగంతో అందించాలని నెట్‌ న్యూట్రాలిటీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.

అంతేకాక, నెట్‌ న్యూట్రాలిటీపై ప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో 5జీ, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌, ఐఓటీ వంటి ఆధునిక సాంకేతికతల వల్ల ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ మరింత క్లిష్టమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న డేటా వినియోగాన్ని సమర్థంగా నిర్వహించాలంటే నెట్‌వర్క్‌లలో ‘క్వాలిటీ ఆఫ్ సర్వీస్‌’ (QoS) ఆధారంగా ప్రాధాన్యత కేటాయించే అవకాశాలు పరిశీలించాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో, వినియోగదారుల ప్రాథమిక హక్కులు, ఏ యాప్‌కైనా సమాన యాక్సెస్‌ లభించాలనే సూత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు అవసరమని హెచ్చరిస్తున్నారు.

Videos

హిందూపురం YSRCP ఆఫీస్ పై దాడి సాకే శైలజానాథ్ వార్నింగ్

Hindupuram: జై బాలయ్య అంటూ.... టీడీపీ నాయకుల దాడి

ఐబొమ్మ వెబ్సైట్లపై కీలక సమాచారం సేకరణ

Hindupur : YSRCP కార్యకర్తలపైనా దాడిచేసిన టీడీపీ నేతలు

టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ కేసులో కీలక పరిణామం

ఆ ముస్లిం దేశాలపై ట్రంప్ యుద్ధం?

బిహార్ ఫలితాలపై కేసీ వేణుగోపాల్ హాట్ కామెంట్స్

ఆస్ట్రేలియా YSRCP NRIలపై లక్ష్మీపార్వతి ప్రశంసలు

బెట్టింగ్ యాప్ కేసులో రానాను విచారిస్తున్న సీఐడీ

విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్

Photos

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)