Breaking News

జియో రీచార్జ్‌ ప్లాన్: ఒక్కసారి చేస్తే 3 నెలలు ఫుల్‌ బెనిఫిట్స్‌!

Published on Sun, 09/20/2026 - 13:47

దేశంలోని టాప్‌ టెలికమ్‌ ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్‌ జియో తమ అన్ని వర్గాల కస్టమర్లకు అవసరమైన అనేక రకాల ప్రీపెయిడ్‌ ప్లాన్‌లను అందిస్తోంది. పదేపదే రీఛార్జ్‌ చేసుకునే ఇబ్బందిని తగ్గించుకోవాలనుకునే కస్టమర్ల కోసం రూ.899 ప్లాన్‌ అందుబాటులో ఉంది. 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 2GB చొప్పున హైస్పీడ్‌ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా 20GB డేటాను అందిస్తున్నారు. మొత్తంగా వ్యాలిడిటీ కాలంలో 200GB డేటాను వినియోగించుకోవచ్చు.

పూర్తి ప్రయోజనాలు ఇవే..

అర్హత ఉన్న కస్టమర్లు, 5G సదుపాయం ఉన్న ప్రాంతాల్లో 5G హ్యాండ్‌సెట్‌ ఉపయోగిస్తే అన్‌లిమిటెడ్‌ 5G డేటా ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. దీంతో 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నాన్‌ స్టాప్‌గా డేటాను వాడుకోవచ్చు.

డేటాతో పాటు వాయిస్‌ కాలింగ్‌ ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాలింగ్‌ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 SMSలు ఉచితంగా పంపుకోవచ్చు. దీంతో మూడు నెలల వ్యాలిడిటీ సమయంలో సాధారణ కాలింగ్‌, SMS అవసరాల కోసం ప్రత్యేకంగా అదనపు రీఛార్జ్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.

రూ.899 ప్లాన్‌లో కస్టమర్లకు కొన్ని డిజిటల్‌ ప్రయోజనాలను కూడా అందిస్తున్నారు. మొబైల్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, లైవ్‌ స్పోర్ట్స్‌ వంటి కంటెంట్‌ను వీక్షించేందుకు OTT ప్రయోజనం లభిస్తుంది. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర ముఖ్యమైన ఫైళ్లను భద్రపరుచుకునేందుకు 50GB ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా ఉంది.

ఇవే కాకుండా టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వినియోగదారులకు 18 నెలల పాటు అధునాతన AI సర్వీస్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందిస్తున్నారు. మొత్తంగా 90 రోజుల వ్యాలిడిటీ, డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, SMSలు, OTT, క్లౌడ్‌ స్టోరేజ్‌, AI ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌లో పొందాలనుకునే వారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)