Breaking News

మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌.. స్టార్‌లింక్‌తో జియో ఒప్పందం

Published on Wed, 03/12/2025 - 10:06

శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్ సేవలను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్ (జేపీఎల్‌) ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం డిజిటల్ అంతరాన్ని పూడ్చడంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మారుమూల, సరైన డిజిటల్‌ కనెక్టివిటిలేని ప్రాంతాల్లో కమ్యునికేషన్‌ సేవలను అందించేందుకు తోడ్పడుతుందని నమ్ముతున్నారు. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ కూడా దేశంలోని తన వినియోగదారులకు స్టార్‌లింక్‌ సేవలు అందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో ఒప్పందం చేసుకుంది.

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవలు ప్రారంభం కావాలంటే రెగ్యులేటరీ అనుమతులు అవసరమవుతాయి. అందుకోసం కంపెనీ ట్రాయ్‌ వద్ద అనుమతులకు అవసరమైన పత్రాలు దాఖలు చేసింది. దీనిపై తుని నిర్ణయం వెలువడకుముందే దేశీయ టెలికాం కంపెనీలు స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కస్టమర్లకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు చేస్తున్న కృషిని హైలైట్‌ చేస్తుంది. జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్ వంటి ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను స్టార్‌లింక్‌ భర్తీ చేయనుంది. సాంప్రదాయ ఫైబర్ నెట్‌వర్క్‌లు విస్తరించే అవకాశం ఉన్న ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడం ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది.

విస్తృతమైన రిటైల్ నెట్‌వర్క్‌, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా స్టార్‌లింక్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జియో యోచిస్తోంది. అందుకు అవసరమైన ఇన్‌స్టలేషన్‌, యాక్టివేషన్, సర్వీస్ అవసరాలకు అనుగుణంగా కస్టమర్ సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులకు సరసమైన, విశ్వసనీయమైన బ్రాండ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని అందించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో గ్రూప్ సీఈఓ మాథ్యూ వోమెన్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ..‘జియో బ్రాండ్‌బ్యాండ్‌ ఎకోసిస్టమ్‌లో స్టార్‌లింక్‌ను అనుసంధానించడం ద్వారా కనెక్టివిటినీ విస్తరిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యుగంలో హై-స్పీడ్ బ్రాండ్‌బ్యాండ్‌ అవకాశాలను పెంచుతున్నాం’ అన్నారు. స్పేస్ఎక్స్ ప్రెసిడెంట్, సీఓఓ గ్విన్ షాట్వెల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ భారతదేశ డిజిటల్‌ కనెక్టివిటీని విస్తరించడానికి జియోతో కలిసి పనిచేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఎస్‌బీఐ యూపీఐ సేవల్లో అంతరాయం

షరతులకు అంగీకారం

దేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్‌ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్‌ ఎప్పటినుంచో యోచిస్తోంది.

యూజర్‌ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్‌ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింగ్‌ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్‌ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది.
 

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)