క్రిప్టో కరెన్సీకి పోటీగా జియో కాయిన్‌?

Published on Sat, 01/18/2025 - 16:57

భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపార దిగ్గజం 'ముకేశ్ అంబానీ' (Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫారమ్‌.. భారతదేశంలో తన వెబ్3, బ్లాక్‌చెయిన్ అరంగేట్రం కోసం పాలిగాన్ ప్రోటోకాల్స్ డెవలపర్ విభాగమైన 'పాలిగాన్ ల్యాబ్స్‌'తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో కంపెనీ 'జియో కాయిన్' (Jio Coin) తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

జియో కాయిన్ గురించి కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ చాలామంది జియో కాయిన్ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొబైల్ రీఛార్జ్‌లు లేదా రిలయన్స్ గ్యాస్ స్టేషన్‌లలో కొనుగోళ్లు వంటి సేవలకు ఉపయోగించబడుతుందని బిటిన్నింగ్ సీఈఓ 'కాశిఫ్ రాజా' తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

క్రిప్టో కరెన్సీ మీద ముకేశ్ అంబానీ చాలా సంవత్సరాలకు ముందే కన్నేశారని. ఈ రంగంలోకి అడుగుపెట్టాలని, ఓ స్పెషల్ కరెన్సీ తీసుకురావాలని భావించగా సమాచారం. ఇందులో భాగంగానే జియో కాయిన్ తీసుకు వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దీనికోసమే పాలిగాన్ ల్యాబ్స్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?

జియో కాయిన్ రావడం నిజమైతే.. క్రిప్టో కరెన్సీ(Crypto Currency)కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 500 మిలియన్ల మంది క్రిప్టో కరెన్సీ వినియోగదారులు ఉన్నారు. అయితే జియోకు 470 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. జియో కాయిన్ అందుబాటులో వస్తే.. వీరందరి ద్రుష్టి దీనిపైన పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)