Breaking News

మరో సంచలనానికి సిద్దమవుతున్న జియో.. త్వరలో 5జీ స్మార్ట్‌ఫోన్

Published on Sat, 11/23/2024 - 16:07

అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో అతి తక్కువ ధర వద్ద రెండు 4జీ మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఇదే బాటలో చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ యోచిస్తున్నట్లు సమాచారం.

భారతదేశపు అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన రిలయన్స్ జియో.. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడానికి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చురర్ (OEMs), యూఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జియో వైస్ ప్రెసిడెంట్ సునీల్ దత్ వెల్లడించారు.

రిలయన్స్ జియో అన్ని స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. పరికరాల తయారీదారులు & బ్రాండ్‌లతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం మాత్రమే కాకుండా.. వినియోగదారులకు సరసమైన పరికరాలను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని సునీల్ దత్ పేర్కొన్నారు.

భారతదేశ టెలికామ్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చిన చరిత్ర జియోకు ఉంది. 2016లో సంస్థ జియో ఫోన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 999 మాత్రమే, నెలకు రూ. 123తో ప్రారంభమయ్యే సరసమైన రీఛార్జ్‌లను అందించింది. కాబట్టి ఇది మార్కెట్లో 10 కోట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.

ఇక రాబోయే జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ కూడా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. అయితే ఇది మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది. దీని ధర ఎంత ఉండొచ్చు? అనే చాలా వివరాలు రాబోయే రోజుల్లో అధికారికంగా వెల్లడవుతాయి.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)