భారత్‌..డేటా సంపన్న దేశం: అంబానీ

Published on Thu, 08/08/2024 - 08:56

మలిదశ వృద్ధి ప్రయాణానికి రిలయన్స్‌ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని సంస్థ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. 2016లో జియో 4జీ టెలికం సేవలను ప్రారంభించడం ద్వారా భారత్‌ను డేటా పరంగా సంపన్న దేశంగా మార్చినట్టు కంపెనీ వార్షిక నివేదికలో అంబానీ పేర్కొన్నారు. జియో ద్వారా దాదాపు దేశంలోని ప్రతి ఇంటికీ అధిక వేగంతో కూడిన 4జీ డేటాను అందుబాటు ధరలకు అందిస్తున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ..‘దేశవ్యాప్తంగా 5జీ సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతర్జాతీయ అనిశ్చితులున్నా ప్రపంచంలో భారత్‌ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది. వేగంగా వృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగ అవసరాలను తీర్చే స్థాయిలో రిలయన్స్‌ రిటైల్‌ ఉంది. 100 బిలియన్‌ డాలర్ల (రూ.8.4 లక్షల కోట్లు) విలువ కలిగిన రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో బడా ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నార’ని చెప్పారు.

ఇదీ చదవండి: ఒక్క రూపాయీ జీతం తీసుకోని ముఖేష్‌ అంబానీ!

గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌

‘2035 నాటికి సున్నా కర్బన ఉద్గారాల విడుదలే(నెట్‌ జీరో) లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు వీలుగా జామ్‌నగర్‌లో దీరూభాయి అంబానీ గ్రీన్‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల తయారీకి సంబంధించి రిలయన్స్‌ సమగ్ర కేంద్రంగా ఉంటుంది. వయకామ్‌ 18, స్టార్‌ ఇండియా వ్యాపారాల విలీనంతో జాయింట్‌ వెంచర్‌ టెలివిజన్, డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో అగ్రగామిగా అవతరిస్తున్నాం’ అని ముఖేశ్‌ అన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)