Breaking News

ఏటీఎఫ్‌ ధర 6 శాతం తగ్గింపు..

Published on Thu, 11/02/2023 - 05:01

న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా వరుసగా పెరుగుతూ వచి్చన విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు తాజాగా దాదాపు 6 శాతం తగ్గాయి. అయితే, వాణిజ్య వంట గ్యాస్‌ సిలిండర్‌ (19 కేజీలు) రేటు రూ. 101.5 మేర పెరిగింది. గృహావసరాలకు ఉపయోగించే వంట గ్యాస్‌ (14.2 కేజీలు) ధర మాత్రం యధాతథంగా రూ. 903 (ఢిల్లీలో) వద్దే ఉంది. ప్రభుత్వ రంగ ఇంధన రిటైలింగ్‌ సంస్థలు బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏటీఎఫ్‌ రేటు కిలోలీటరుకు రూ. 6,954.25 మేర (5.79 శాతం) తగ్గి రూ. 1,18,199.17కి దిగి వచి్చంది. జూలై నుంచి చూస్తే నాలుగు నెలల్లో విమాన ఇంధనం ధర రూ. 29,391 మేర పెరిగింది.

ఎయిర్‌లైన్స్‌ నిర్వహణ వ్యయాల్లో ఇంధనం వాటా దాదాపు 40 శాతం ఉంటున్న నేపథ్యంలో తాజా తగ్గింపుతో విమానయాన సంస్థలకు కాస్త ఊరట లభించనుంది. మరోవైపు, సవరించిన రేట్ల ప్రకారం 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర ఢిల్లీలో రూ. 1,833గా ఉంటుంది. వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచడం ఇది రెండోసారి. అక్టోబర్‌ 1న రేటును ఏకంగా రూ. 209 మేర ఇంధన కంపెనీలు పెంచాయి. ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌), హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) సంస్థలు .. అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా ప్రతి నెల 1న వంట గ్యాస్, ఏటీఎఫ్‌ ధరలను సవరిస్తాయి.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)