జెఫ్ బెజోస్ సీఈఓగా రీ-ఎంట్రీ!

Published on Wed, 07/22/2026 - 12:19

ఐదేళ్ల క్రితం అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగి వ్యాపార కార్యకలాపాలకు కొంత విరామం ప్రకటించిన జెఫ్ బెజోస్ మళ్లీ పూర్తిస్థాయి క్రియాశీలక యాజమాన్యంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. కృత్రిమ మేధ రంగంలో రూపుదిద్దుకుంటున్న నూతన శకంలో భాగస్వామి అయ్యేందుకు ఆయన ప్రోమెథియస్ (Prometheus) అనే హై-టెక్ ఏఐ స్టార్టప్‌కు కో-సీఈఓగా బాధ్యతలు స్వీకరించడం గ్లోబల్ టెక్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

‘చూస్తూ కూర్చోలేకపోయాను’

ఈ అకస్మాత్ నిర్ణయానికి గల కారణాన్ని బెజోస్ ఇటీవల వెల్లడిస్తూ.. ‘ఏఐ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, దాని అపరిమిత సామర్థ్యాన్ని నిశితంగా గమనించిన తర్వాత నేను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేకపోయాను. ఈ సాంకేతిక పరిణామంలో భాగం కావడానికి పూర్తిస్థాయిలో పని చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. ఈ తరహా కఠినమైన రోజువారీ విధులు తనకు శ్రమతో కూడిన సంతృప్తి ఇస్తాయని వ్యాఖ్యానించారు.

భౌతిక ప్రపంచం వైపు ఏఐ ప్రయాణం

సైంటిస్ట్ విక్ బజాజ్‌తో కలిసి బెజోస్ ఉమ్మడిగా నడిపిస్తున్న ప్రోమెథియస్ సంస్థ డిజిటల్ లేదా టెక్స్ట్ మోడళ్లకే పరిమితం కాకుండా భౌతిక ప్రపంచంలోని ఇంజినీరింగ్, తయారీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాల కోసం ఏఐ నమూనాలను అభివృద్ధి చేస్తోంది. ప్రారంభంలోనే 6.2 బిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణతో ప్రారంభమైన ఈ స్టార్టప్ ఇటీవల మరో 12 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించి 41 బిలియన్‌ డాలర్ల రికార్డు వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకుంది.

ఉద్యోగాల కోతపై భిన్నమైన దృక్పథం

ఏఐ సాంకేతికత వల్ల లక్షలాది ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న గ్లోబల్ ఆందోళనలను బెజోస్ తోసిపుచ్చారు. మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా ఏఐ మారదని, ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే పని చేస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత పెరిగేకొద్దీ మానవ అవసరాలు, అవకాశాలు పెరుగుతాయని, ఫలితంగా భవిష్యత్తులో నిరుద్యోగం కంటే నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)