Breaking News

భారత్‌లో సరికొత్త అమెరికన్ బ్రాండ్ కారు లాంచ్.. ధర ఎంతో తెలుసా?

Published on Thu, 06/06/2024 - 07:25

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ జీప్.. భారతీయ విఫణిలో సరికొత్త 'స్పెషల్ ఎడిషన్ మెరిడియన్ ఎక్స్‌' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ. 34. 27 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా వరకు అప్డేట్స్ పొందింది.

జీప్ మెరిడియన్ స్పెషల్ ఎడిషన్.. గ్రే రూఫ్, గ్రే యాక్సెంట్‌లతో అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది. ఇందులో సైడ్ మౌల్డింగ్, పుడిల్ ల్యాంప్స్, ప్రోగ్రామబుల్ యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ప్రీమియం కార్పెట్ మ్యాట్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ధర దాని ఎంట్రీ లెవల్ లిమిటెడ్ (ఓ) వేరియంట్ కంటే రూ. 50000 ఖరీదైనది.

కొత్త జీప్ మెరిడియన్ ఎక్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది.

జీప్ కంపెనీ ఈ ఏడాది చివర్లో మిడ్-లైఫ్ అప్‌డేట్‌ను అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ అప్డేటెడ్ SUV ఇటీవలే టెస్టింగ్ దశలో కనిపించింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందిందని తెలుస్తోంది. ఇది దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత స్కోడా కొడియాక్, ఎంజీ గ్లోస్టర్, టయోటా ఫార్చ్యూనర్‌ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)