Breaking News

ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించిన స్పెషల్ బైక్

Published on Sat, 09/05/2026 - 15:05

క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న.. జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్, ఇటీవల లాంచ్ చేసిన జావా 42 ఎఫ్‌జె ఆల్ స్టార్స్ తర్వాత తమ కొత్త శ్రేణిని విస్తరిస్తూ.. 'జావా ఆల్ స్టార్స్ 42 బాబర్‌'ను ఆవిష్కరించింది. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, గ్లోబల్ చెస్ లీగ్ 2026లో ఈ బైకును ఆవిష్కరించారు. దీని ధరలు రూ. 2.09 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి.

జావా ఆల్ స్టార్స్ 42 బాబర్‌.. స్టాండర్డ్ జావా 42 బాబర్‌పైనే ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త పెయింట్ ఎంపికలు, చదరంగం గళ్ల గ్రాఫిక్స్, ఆల్ స్టార్స్ చిహ్నాన్ని పొందుతుంది. ఇది బ్లాక్ మిర్రర్, షాడో బ్లాక్, సిల్వర్ నైట్, జాస్పర్ రెడ్, మిస్టిక్ కాపర్ అనే ఆరు రంగులలో లభిస్తుంది.

వేరియంట్ వారీ ధరలు
➤ఆల్ స్టార్స్ మిస్టిక్ కాపర్: రూ. 2,08,942
➤ఆల్ స్టార్స్ జాస్పర్ రెడ్: రూ. 2,15,942
➤ఆల్ స్టార్స్ సిల్వర్ నైట్: రూ. 2,15,942
➤ఆల్ స్టార్స్ షాడో బ్లాక్: రూ. 2,17,942
➤ఆల్ స్టార్స్ బ్లాక్ మిర్రర్: రూ. 2,19,942

ఈ స్పెషల్ ఎడిషన్.. స్టాండర్డ్ 42 బాబర్‌లోని 334 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తోనే కొనసాగుతుంది. ఇది 7,500 rpm వద్ద 29 హార్స్ పవర్, 5,500 rpm వద్ద 30.01 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ జత చేయబడి ఉంటాయి.

ఈ మోటార్‌సైకిల్‌లో డబుల్-క్రాడిల్ ఫ్రేమ్, 35 మిమీ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, 7 టైప్స్ ప్రీలోడ్ సర్దుబాటుతో కూడిన గ్యాస్-ఛార్జ్డ్ రియర్ మోనోషాక్‌ను వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందువైపు 280 మిమీ డిస్క్, వెనుకవైపు 240 మిమీ డిస్క్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు.

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!