Breaking News

జన్‌ధన్‌ ఖాతాలు 56.16 కోట్లు: డిపాజిట్లు ఎంతంటే?

Published on Fri, 08/29/2025 - 15:12

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం కింద ఖాతాల సంఖ్య ఆగస్టు 13 నాటికి 56.16 కోట్లకు చేరింది. ఇందులో రూ.2.68 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. 2015 మార్చి నాటికి ఈ ఖాతాల సంఖ్య 14.72 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 11 ఏళ్లలో గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. జన్‌ధన్‌ ఖాతాదారుల్లో 56 శాతం మహిళలేనని.. 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల్లో తెరిచినట్టు వెల్లడించింది.

లబ్ధిదారుల ఖాతాలకు ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో రూ.45 లక్షల కోట్లను బదిలీ చేసినట్టు తెలిపింది. జన్‌ధన్‌ ఖాతాదారులకు 38.68 కోట్ల రూపే డెబిట్‌ కార్డులు మంజూరైనట్టు వెల్లడించింది.

దేశంలో 94 శాతం వయోజనులకు బ్యాంక్‌ ఖాతాలున్నట్టు తెలిపింది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న సంకల్పంతో కేంద్ర సర్కారు 2014 ఆగస్ట్‌ 28న ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. దీనికంద సున్నా బ్యాలన్స్, ఉచిత రూపే డెబిట్‌ కార్డు, ప్రమాద బీమా తదితర సదుపాయాలతో సేవింగ్స్‌ ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం కల్పించింది.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)