Breaking News

జేపీ అసోసియేట్స్‌ రూ. 4,258 కోట్ల డిఫాల్ట్‌

Published on Tue, 11/07/2023 - 04:38

న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న జేపీ గ్రూప్‌లో ప్రధాన కంపెనీ జైప్రకాష్‌ అసోసియేట్స్‌ (జేఏఎల్‌) రూ. 4,258 కోట్ల రుణాల (అసలు, వడ్డీ) చెల్లింపులో డిఫాల్ట్‌ అయ్యింది. అసలు కింద రూ. 1,733 కోట్లు, వడ్డీ కింద రూ. 2,525 కోట్ల మొత్తాన్ని అక్టోబర్‌ 31న చెల్లించాల్సి ఉండగా, చెల్లించలేకపోయినట్లు నియంత్రణ సంస్థకు తెలియజేసింది. నిర్వహణ మూలధనం, టర్మ్‌ లోన్‌లు, విదేశీ కరెన్సీ కన్వర్టబుల్‌ బాండ్స్‌ రూపంలో ఈ మొత్తాన్ని కంపెనీ సేకరించింది.

2037 కల్లా రూ. 29,272 కోట్ల రుణాలు (వడ్డీ సహా) చెల్లించాల్సి ఉండగా, 2023 అక్టోబర్‌ 31 నాటికి రూ. 4,258 కోట్లను గడువులోగా చెల్లించలేకపోవడంతో బాకీ పడినట్లు సంస్థ వివరించింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా రూ. 18,682 కోట్ల మొత్తాన్ని ప్రతిపాదిత స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కి బదలాయించనుండటంతో ఆ మేరకు భారం తగ్గనుంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జేఏఎల్‌ పేర్కొంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)