Breaking News

కేబీసీ తొలి విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

Published on Sat, 01/25/2025 - 14:07

బాలివుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా ఉన్న ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati)లో హర్షవర్ధన్ నవాతే తొలి కోటీశ్వరుడిగా చరిత్ర సృష్టించి 25 ఏళ్లు అయింది. 2000లో తన విజయం ఆయన జీవితాన్ని మార్చడమే కాకుండా దేశం వ్యాప్తంగా అనేక మందికి కేబీసీ వేదిక అయ్యేందుకు తోడ్పడింది. ప్రస్తుతం హర్షవర్ధన్ కార్పొరేట్ ప్రపంచంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారు. ప్రభావవంతమైన కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆధ్వర్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

కెరీర్ ప్రయాణం ఇలా..

కేబీసీలో అద్భుత విజయం తర్వాత హర్షవర్ధన్ జీవితం నాటకీయ మలుపు తిరిగింది. మొదట్లో ఐఏఎస్(IAS) కావాలనుకున్న ఆయన కేబీసీలో విజేతగా నిలిచిన తర్వాత తన దృష్టిని కార్పొరేట్ రంగం వైపు మళ్లించారు. మహీంద్రా గ్రూప్‌తో సహా ప్రఖ్యాత సంస్థల్లో కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బిలిటీ హెడ్‌గా పలు కీలక పదవులు నిర్వహించారు. అంకితభావం, వ్యూహాత్మక దార్శనికత ఆయనకు పరిశ్రమలో గుర్తింపు, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి.

జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్‌కు సీఈఓగా..

డిసెంబర్ 2024లో హర్షవర్ధన్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సామాజిక అభివృద్ధి విభాగమైన జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ విభాగంలోని ఇతర కమ్యూనిటీలకు సాధికారత కల్పించేందుకు, దేశం అంతటా సుస్థిర అభివృద్ధిని పెంపొందించడానికి సంస్థ విధానాలను పాటిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: నెలలో 8.2 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ

వ్యక్తిగత జీవితం

హర్షవర్ధన్ భార్య సారిక, ఇద్దరు కుమారులతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బిజీ ప్రొఫెషనల్ లైఫ్ ఉన్నప్పటికీ తాను సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ అప్పటి కేబీసీ విజయంపై తన ఆలోచనలను పంచుకున్నారు. ‘ఆ విజయం నా జీవితంలో మరవలేనిది. నేనీ స్థానంలో ఉన్నానంటే ఆ కార్యక్రమం వల్లే’అని చెప్పారు. ఇన్నేళ్లుగా ప్రజల నుంచి తనకు లభిస్తున్న గుర్తింపు, ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. క్విజ్ షో కంటెస్టెంట్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా హర్షవర్ధన్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తూనే ఉంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు