Breaking News

ఐటీసీ లాభం జూమ్‌

Published on Tue, 08/15/2023 - 04:55

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో నికర లాభం 16% ఎగసి రూ. 5,180 కోట్లను అధిగమించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,462 కోట్లు ఆర్జించింది. నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 19,831 కోట్ల నుంచి రూ. 18,639 కోట్లకు తగ్గింది. ఇది 6% క్షీణతకాగా.. మొత్తం వ్యయాలు సైతం 13% తగ్గి రూ. 12,422 కోట్లకు పరిమితమయ్యాయి. ఇక మొత్తం టర్నోవర్‌ 4% నీరసించి రూ. 19,362 కోట్లుగా నమోదైంది.
 
విభాగాలవారీగా..:
తాజా క్యూ1లో ఐటీసీ.. ఎఫ్‌ఎంసీజీ విభాగం 13 శాతంపైగా వృద్ధితో రూ. 13,528 కోట్ల ఆదాయాన్ని సాధించింది. దీనిలో సిగరెట్ల బిజినెస్‌ నుంచి 12 శాతం అధికంగా రూ. 8,356 కోట్లు అందుకుంది. హోటళ్ల బిజినెస్‌ 8% బలపడి రూ. 625 కోట్ల ఆదాయం అందుకుంది.  

‘హోటల్‌’ షేర్ల జారీ తీరిదీ..: ఐటీసీ హోటల్స్‌ పేరుతో ఆతిథ్య రంగ బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా ఐటీసీ విడదీస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కంపెనీ బోర్డు 1:10 నిష్పత్తిలో షేర్ల జారీకి ఆమోదముద్ర వేసినట్లు ఐటీసీ పేర్కొంది.  వాటాదారులకు ఐటీసీలోగల ప్రతీ 10 షేర్లకుగాను 1 ఐటీసీ హోటల్‌ షేరును కేటాయించనుంది. షేర్ల జారీ తదుపరి ఐటీసీ హోటల్స్‌లో 60% వాటాను ఐటీసీ వాటాదారులు పొందనుండగా.. ఐటీసీ 40% వాటాను కలిగి ఉండనుంది. హోటల్‌ షేర్లు త్వరలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌కానున్నాయి. ఐటీసీ హోటల్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌ చేసేందుకు సుమారు 15 నెలలు పట్టవచ్చని ఐటీసీ తాజాగా అంచనాలు ప్రకటించింది.
ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్‌ఈలో నామమాత్ర లాభంతో రూ. 449 వద్ద ముగిసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)