Breaking News

ఐటీసీ లాభం ప్లస్‌

Published on Fri, 10/31/2025 - 00:48

కోల్‌కతా: డైవర్సిఫైడ్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్‌లో నికర లాభం 3% వృద్ధితో రూ. 5,187 కోట్లకు చేరింది. జీఎస్‌టీ సవరణలు, అధిక వర్షాల నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ విభాగం సవాళ్లు ఎదుర్కొంది. 

గతేడాది ఇదే కాలంలో రూ. 5,054 కోట్లు ఆర్జించింది. ఇబిటా స్వల్పంగా(2%) బలపడి రూ. 6,695 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం రూ. 21,536 కోట్ల నుంచి రూ. 21,256 కోట్లకు స్వల్పంగా క్షీణించింది. నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో అమితాబ్‌ కాంత్‌ను డైరెక్టర్, స్వతంత్ర డైరెక్టర్‌గా బోర్డు ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. 2026 జనవరి నుంచి కాంత్‌ ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 

ఎఫ్‌ఎంసీజీ గుడ్‌ 
క్యూ2లో సిగరెట్లుసహా బ్రాండెడ్‌ ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతోకూడిన ఎఫ్‌ఎంసీజీ విభాగం ఆదాయం 7% పుంజుకుని రూ. 15,473 కోట్లను అధిగమించినట్లు ఐటీసీ వెల్లడించింది. అగ్రి బిజినెస్‌ ఆదాయం రూ. 5,845 కోట్ల నుంచి రూ. 4,038 కోట్లకు క్షీణించగా.. పేపర్‌ బోర్డులు, ప్యాకేజింగ్‌ టర్నోవర్‌ స్వల్ప వృద్ధితో రూ. 2,220 కోట్లకు చేరింది.  ఐటీసీ షేరు బీఎస్‌ఈలో 0.7 శాతం నీరసించి రూ. 419 వద్ద ముగిసింది.  

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)