Breaking News

2030 నాటికి 220 హోటళ్లు

Published on Tue, 08/12/2025 - 05:15

న్యూఢిల్లీ: ఐటీసీ హోటల్స్‌ 2030 నాటికి నిర్వహణలోని హోటళ్ల సంఖ్యను 220కి పెంచుకోనుంది. అప్పటికి 20వేల కీలను (గదులు) కలిగి ఉంటామని సంస్థ చైర్మన్‌ సంజీవ్‌ పురి ప్రకటించారు. ఐటీసీ నుంచి వేరుపడి లిస్టింగ్‌ అనంతరం జరిగిన తొలి ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడారు. నేటి అంతర్జాతీయ అల్లకల్లోల పరిస్థితుల్లో ఆవిష్కరణలు, టెక్నాలజీలపై పెట్టుబడులకు పిలుపునిచ్చారు. 

తద్వారా మరింత బలోపేతం కావాలని, స్వావలంబన సాధించాలని పేర్కొన్నారు. యువ జనాభా అధికంగా ఉండడం, ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వేగవంతమైన పట్టణీకరణ, టెక్నాలజీ సామర్థ్యాలు, పోటీతత్వం అన్నవి కంపెనీని నిలదొక్కుకునేలా చేస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 2.2 హోటల్‌ గదులు అందుబాటులో ఉంటే, భారత్‌లో 0.3 గదులుగానే ఉన్నట్టు పురి చెప్పారు.

అస్సెట్‌ రైట్‌ విధానంతో కంపెనీ వేగంగా వృద్ధిని సాధించగలదని చెప్పారు. టైర్‌ 2, 3 పట్టణాలకు ఐటీసీ హోటల్స్‌ విస్తరిస్తున్నట్టు చెప్పారు. కస్టమర్లకు మెరుగైన అనుభవంతోపాటు నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు వీలుగా డిజిటల్‌ టెక్నాలజీలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరాలో ఐటీసీ హోటల్స్‌ రూ.3,300 కోట్ల ఆదాయాన్ని సాధించిందని, ఎబిట్డా మార్జిన్‌ 36 శాతానికి పెరిగినట్టు చెప్పారు.    

#

Tags : 1

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)