Breaking News

రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌పై కన్ను!

Published on Fri, 07/24/2026 - 19:27

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. వచ్చే దశాబ్దకాలంలో (2035 నాటికి) ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించి రూ. 8 లక్షల కోట్లకు వృద్ధి చెందనున్న మార్కెట్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఎండీ సంజీవ్‌ పురి తెలిపారు.

ప్రీమియం ఉత్పత్తులు, యువ జనాభా ఇందుకు తోడ్పడనున్నట్లు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇతర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా కూడా అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాల్లో విస్తరిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కొనుగోలుదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాధనాలను ఉపయోగిస్తున్నట్లు పురి తెలిపారు.

ఆన్‌లైన్, క్విక్‌ కామర్స్‌ మాధ్యమాలు వేగంగా విస్తరిస్తున్నాయని, స్మార్ట్‌ సరఫరా వ్యవస్థలు అనేక ఉత్పత్తులను కొనుగోలుదారుల ఇంటి వద్దకు సురక్షితంగా చేరుస్తున్నాయని చెప్పారు. ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 30 పైగా ప్రపంచ స్థాయి బ్రాండ్స్‌ ఉన్నాయని పురి తెలిపారు.

2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,720 కోట్లుగా ఉన్న ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,200 కోట్లకు ఎగిసిందన్నారు. మరోవైపు పాలసీలపరంగా వివిధ సంస్కరణల తోడ్పాటుతోనే భారత్‌ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుస్తోందని పురి తెలిపారు.

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)