Breaking News

అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?

Published on Sun, 07/19/2026 - 09:17

ఒకప్పుడు ఇస్రోలో ఉద్యోగం అంటే ప్రతి ఇంజినీర్‌, శాస్త్రవేత్తకు జీవితకాల కల. చంద్రయాన్‌, మంగళయాన్‌, ఆదిత్య-ఎల్1, గగన్‌యాన్‌ వంటి ప్రతిష్ఠాత్మక మిషన్లలో పనిచేసే అవకాశం, దేశసేవ అనే గౌరవం, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ ఇస్రోను అత్యంత ఆకర్షణీయ సంస్థగా నిలబెట్టాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. గత కొన్ని నెలల్లోనే వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామాలు చేయడం లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం కేంద్రాన్ని సైతం ఆందోళనకు గురి చేసింది. దీంతో కీలక మిషన్లలో పనిచేస్తున్న గ్రూప్-ఏ శాస్త్రవేత్తల రాజీనామాలపై కఠిన నిబంధనలు అమలు చేయాలని అంతరిక్ష శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

ఇస్రోలో జీతాలు ఎంత?

ఇస్రోలో కొత్తగా ఎంపికయ్యే సైంటిస్ట్‌/ఇంజినీర్‌-SC స్థాయి అధికారికి 7వ వేతన సంఘం ప్రకారం బేసిక్ పే రూ.56,100 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కలిపి నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ సైంటిస్ట్‌-SD, SE, SF, SG, H స్థాయిలకు పదోన్నతులు లభిస్తాయి. అత్యున్నత స్థాయిలో నెలకు రూ.2 లక్షలకు పైగా స్థూల వేతనం పొందే అవకాశం ఉంది. అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి సాధారణంగా 20–30 ఏళ్ల సర్వీస్‌ అవసరమవుతుంది.

ప్రైవేట్ స్పేస్ కంపెనీల్లో ఎంత?

ఇక్కడే ప్రధాన తేడా కనిపిస్తోంది. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ వంటి ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ ఆధారిత వేతనాలు అందిస్తున్నాయి. ఫ్రెషర్లకు రూ.8–15 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. 3–7 ఏళ్ల అనుభవం ఉన్న వారు రూ.15–30 లక్షలు అందుకుంటున్నారు. అదే సీనియర్ రాకెట్, ప్రొపల్షన్, ఏవియానిక్స్ నిపుణులు అయితే రూ.30–60 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వేతనాన్ని కూడా కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. వీటితో పాటు స్టాక్‌ ఆప్షన్‌లు (ESOPs), పనితీరు బోనస్‌లు, విదేశీ ప్రాజెక్టులు, వేగవంతమైన ప్రమోషన్లు కూడా లభిస్తున్నాయి. కంపెనీ విలువ పెరిగితే స్టాక్‌ల విలువకోట్ల రూపాయలకు చేరే అవకాశం కూడా ఉంటుంది.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)