Breaking News

జియో సినిమాలోకి యూట్యూబ్‌ ఇండియా ఎండీ..?

Published on Thu, 08/01/2024 - 14:49

గూగుల్‌ ఆధ్వర్యంలోని యూట్యూబ్‌ ఇండియాకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఇషాన్ ఛటర్జీ తన పదవికి రాజీనామా చేశారు. వయాకామ్ 18 యాజమాన్యంలోని జియో సినిమా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (సీఆర్‌ఓ)గా చేరబోతున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది.

యూట్యూబ్‌ ఇండియాలో నాలుగేళ్ల నుంచి సేవలందిస్తున్న ఛటర్జీ గూగుల్‌లో దాదాపు 13 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలో యూరప్, ఆసియా అంతటా అనేక హోదాల్లో సేవలందించారు. యూట్యూబ్‌ ఎండీగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు యూట్యూబ్‌ ఏపీఏసీ, ప్రోడక్ట్ పార్టనర్‌షిప్‌ ఎండీగా వ్యవహరించారు. ఛటర్జీ రాజీనామాపై వయోకామ్‌18, యూట్యూబ్‌ రెండు సంస్థలు వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: కాల్‌ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!

ఇదిలాఉండగా, అమెజాన్ ప్రైమ్ వీడియో కంట్రీ డైరెక్టర్ సుశాంత్ శ్రీరామ్‌ను వయోకామ్‌ 18 చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (సీఎంఓ)గా ఇటీవల నియమించింది. తాజాగా వస్తున్న కథనాల ప్రకారం ఛటర్జీని సీఆర్‌ఓగా చేర్చుకుంటే వయోకామ్‌లో జరిగే రెండో అతిపెద్ద నియామకమవుతుంది. వీరిద్దరు వయోకామ్‌ 18 డిజిటల్ వెంచర్స్ సీఈఓ కిరణ్ మణికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ ఆధ్వర్యంలోని ఈ సంస్థ ఇప్పటికే వాల్ట్ డిస్నీలో వాటాలు పెంచుకుంది.

#

Tags : 1

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)