Breaking News

బీమా కంపెనీలకు ఐఆర్‌డీఏఐ సర్క్యులర్‌ జారీ

Published on Sat, 05/11/2024 - 10:16

బీమా కంపెనీలు వాటికి నిర్దేశించిన రంగాల్లో తప్పనిసరిగా కనీస వ్యాపారం చేయాలని ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏఐ) మాస్టర్‌ సర్క్యులర్‌ను జారీ చేసింది. 2047 నాటికి అందరికీ బీమా అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

బీమా కంపెనీలు గ్రామీణ ప్రాంతాల్లో, సామాజిక రంగంలో, మోటారు థర్డ్ పార్టీకి సంబంధించి కనీస లక్ష్యాలు చేరుకోవాలని ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ఈ ఆదేశాలు జీవిత బీమా సంస్థలతోపాటు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌ సంస్థలకు వర్తిస్తాయని పేర్కొంది. ఆయా కంపెనీలు తప్పనిసరిగా వాటికి కేటాయించిన రంగాల్లో కనీస వ్యాపారాన్ని చేయాలని చెప్పింది.

ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్‌ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?

లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖతో సంప్రదించి గతంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలకు గ్రామ పంచాయతీలను కేటాయించింది. గ్రామీణరంగ బాధ్యతలను నెరవేర్చాలని ఆదేశించింది. ఆయా కంపెనీలు పంచాయతీల పరిధిలో బీమాలేని వారికి అవగాహన కల్పించి బీమా తీసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. సామాజిక రంగంలో, మోటార్ థర్డ్ పార్టీ బీమా చేసుకునేలా సంస్థలు బాధ్యత వహించి తమకు నిర్దేశించిన కనీస టార్గెట్‌ను పూర్తి చేయాలి. ప్రస్తుతం దేశంలో ఐదు స్వతంత్ర ఆరోగ్య బీమా కంపెనీలు, 40 సాధారణ బీమా కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయి.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)