Breaking News

రిలయన్స్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా నియామకం

Published on Sat, 12/14/2024 - 15:05

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా ఇరా బింద్రా(47)ను నియమిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ ప్రకటించారు. ఈ స్థాయి వ్యక్తుల నియామకాలకు సంబంధించిన వివరాలను ముఖేశ్‌ నేరుగా వెల్లడించడం ఇదే తొలిసారి. ఇరా బింద్రా ఇప్పటివరకు యూఎస్‌లోని మెడ్‌ట్రానిక్ సంస్థలో పనిచేశారు. అక్కడ ఆమె హెచ్‌ఆర్‌ విభాగాధిపతిగా, కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌లో అన్ని అనుబంధ సంస్థలకు సంబంధించి టాప్‌ మేనేజ్‌మెంట్‌ నియామకాలను ఈమె చేపట్టబోతున్నారు. కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమించడంతో ఈమె రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న మొదటి కుటుంబేతర మహిళ కావడం విశేషం.

ఇదీ చదవండి: సుప్రీం కోర్టు ఆమోదంతో రూ.4,025 కోట్ల ఆస్తులు అప్పగింత

‘రిలయన్స్‌ గ్రూప్‌లో టాలెంట్‌ను మెరుగుపరిచేందుకు బింద్రా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నాతోసహా ఇషా, ఆకాష్, అనంత్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో కలిసి పని చేస్తారు. విభిన్న పరిశ్రమలు, వ్యాపార సైకిల్స్‌పై బింద్రాకు అపార పరిజ్ఞానం ఉంది. మెడ్‌ట్రానిక్‌లో కీలక బాధ్యతల్లో పని చేశారు. జీఈ వంటి ఫార్చ్యూన్ 100 కంపెనీలో హెచ్‌ఆర్ టీమ్‌లకు నాయకత్వం వహించారు. కొత్త ఆపరేటింగ్ మోడల్‌ రూపొందించి దాన్ని అమలు చేశారు. తన నైపుణ్యాలు కంపెనీకి ఎంతో ఉపయోగపడుతాయి’ అని ముఖేశ్‌ అంబానీ అన్నారు.

  • 1998లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి బింద్రా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

  • 1999లో నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

  • తర్వాత ఆమె మెడ్‌ట్రానిక్‌లో చేరడానికి ముందు జీఈ క్యాపిటల్, జీఈ ఇండియా, జీఈ హెల్త్‌కేర్, జీఈ ఆయిల్ & గ్యాస్‌లో పనిచేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)