Breaking News

మార్కెట్లోకి ఐక్యూ కొత్త ఫోన్‌..

Published on Sun, 11/30/2025 - 09:10

స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తమ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ ఐక్యూ 15ని ఆవిష్కరించింది. డిస్కౌంట్లు పోగా ధర రూ. 64,999 నుంచి ప్రారంభమవుతుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలీట్‌ జెన్‌ 5 ప్రాసెసర్, సూపర్‌కంప్యూటింగ్‌ చిప్‌ క్యూ3, ఆండ్రాయిడ్‌ 16, ట్రిపుల్‌ 50 ఎంపీ కెమెరా సిస్టం, 7000 ఎంఏహెచ్‌ సిలికాన్‌ ఎనోడ్‌ బ్యాటరీ మొదలైన ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

 ఐక్యూ 15 (iQOO 15) 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. రెండు మోడళ్లపై పరిచయ లాంచ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. డిసెంబర్‌ 1 నుంచి అమెజాన్, ఐక్యూ ఈస్టోర్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డులపై రూ. 7,000 డిస్కౌంటు, అర్హత కలిగిన కస్టమర్లకు అదనంగా రూ.1,000 కూపన్‌ డిస్కౌంటు లభిస్తాయి.

ఐక్యూ 15 పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

  • స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, Q3 గేమింగ్ చిప్ సెట్‌లు వేగవంతమైన ప్రాసెసింగ్, మల్టీ టాస్కింగ్, యాప్ స్విచింగ్, గేమింగ్ లను అందిస్తాయి. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఇందులో ఉంది.

  • ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 6పై నడుస్తుంది. ఐదేళ్ల సాఫ్ట్ వేర్ అప్ డేట్ లు, ఏడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లను కంపెనీ అందించనుంది.

  • ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడిన 50MP సోనీ IMX921 మెయిన్ సెన్సార్, 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 50MP అల్ట్రావైడ్ షూటర్‌తో బహుముఖ ట్రిపుల్ రియర్ సెటప్ ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.

  • 6.85-అంగుళాల శామ్ సంగ్ M14 అమోల్డ్ LTPO డిస్ ప్లే ప్యానెల్. ఇది 2K రిజల్యూషన్, 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

  • భారీ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్ లెస్ ఛార్జింగ్ ను సపోర్ట్‌ చేస్తుంది. స్మార్ట్ బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ వంటివి అదనపు ఫీచర్లు.

ఇదీ చదవండి 👉 కొత్త రూల్‌: ఫోన్‌లో సిమ్‌ లేకుంటే వాట్సాప్‌ బంద్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)