ఫ్లిప్‌కార్ట్‌పై మండిపడ్డ యూజర్: ఇంత అన్యాయమా అంటూ..

Published on Fri, 11/01/2024 - 11:39

సాధారణంగా ఒక ప్రొడక్ట్ విలువ ఒక్కో యాప్‌లో.. ఒక్కో విధంగా ఉండొచ్చు. కానీ ఒకే యాప్‌లో ఒక ప్రొడక్ట్ ధర రెండు ఫోన్‌లలో వేరువేరు చూపిస్తే? ఇదెలా సాధ్యం, ఎక్కడైనా జరుగుతుందా.. అనుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

సౌరభ్ శర్మ అనే ఐఓఎస్ యూజర్.. ఐఫోన్‌లోని ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఓ చిన్న క్యాబిన్ సూట్‌కేస్ కొనుగోలు చేయాలని చూసారు. అయితే దాని ధర రూ.4,799 అని చూపిస్తోంది. అదే ఉత్పత్తిని ఆండ్రాయిడ్ యాప్‌లో చూస్తే.. దాని ధర 4,119 రూపాయలుగా చూపిస్తోంది. ఈ రెండింటినీ సౌరభ్ స్క్రీన్ షాట్ తీసి, తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఆండ్రాయిడ్ vs ఐఓఎస్.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వివిధ ధరలు అంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో కూడా వ్యత్యాసం కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్ నెలకు రూ. 1373 నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఐఓఎస్ యూజర్ నో కాస్ట్ ఈఎంఐ రూ. 1600 నుంచి ప్రారంభమవుతోందని ఇక్కడా చూడవచ్చు. ఇది చాలా అన్యాయమని సౌరభ్ శర్మ వెల్లడించారు.

సౌరభ్ శర్మ.. ధరల వ్యత్యాసం గురించి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ సపోర్ట్‌తో కూడా సంబంధించారు. ''విక్రయదారు వివిధ అంశాల ఆధారంగా ధరలు నిర్ణయిస్తారు. కాబట్టి ధరలలో మార్పు జరగవచ్చు. దయచేసి చింతించకండి. అమ్మకందారులు మీకు గొప్ప డీల్స్, డిస్కౌంట్‌లను అందించడానికి ఎల్లప్పుడూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. హ్యాపీ షాపింగ్'' అంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా దీనిపైన స్పందిస్తూ ఇలాంటి అనుభవాలు తమకు కూడా ఎదురైనట్లు చెప్పుకొచ్చారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)