Breaking News

లాంచ్‌కు ముందే 'ఐఫోన్ ఎస్ఈ 4' వివరాలు లీక్!

Published on Wed, 02/19/2025 - 16:10

యాపిల్ కంపెనీ మార్కెట్లో.. సరసమైన 'ఐఫోన్ ఎస్ఈ4' (iPhone SE 4) లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు కొత్త మోడల్ రానున్నట్లు 'టిక్ కుక్' కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడించారు. లాంచ్ కావడానికి ముందే ఈ ఫోనుకు సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి.

భారత కాలమానం ప్రకారం.. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 4ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే లీకైన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. వెనుక భాగం ఎస్ఈ 3 మాదిరిగా ఉంటుంది. ముందు భాగంలో నాచ్ & సన్నని బాటమ్ బెజెల్ ఉంటుందని తెలుస్తోంది.

ఐఫోన్ ఎస్ఈ 4 రియర్ కెమెరా సిస్టమ్ కూడా స్వల్ప మార్పును పొందినట్లు తెలుస్తోంది. 48 మెగా పిక్సెల్ రియర్ కెమెరా పిక్సెల్ ఉంటుందని చెబుతున్నారు. ఇది ఎస్ఈ 3లోని 12 మెగా పిక్సెల్ సెన్సార్ కంటే అద్భుతంగా ఉంటుంది. హై-ఎండ్ మోడళ్లతో పోలిస్తే రియర్ సెన్సార్ చిన్నదనే చెప్పాలి.

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌ లవ్‌.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ

ఐఫోన్ ఎస్ఈ 4లో పెద్ద 6.1 ఇంచెస్ ఓఎల్ఇడి డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఎస్ఈ 4 మొబైల్ 8 జీబీ ర్యామ్, ఏ18 ప్రాసెసర్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఐఫోన్ 14 వంటి బ్యాటరీనే ఎస్ఈ 4లో కూడా ఉండొచ్చు. అయితే కంపెనీ ఈ ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించిన చాలా వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)