Breaking News

దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్‌

Published on Wed, 12/06/2023 - 09:38

ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్‌ తన ఐఫోన్‌ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని చైనా నుంచి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో చైనా తర్వాత ఇతర దేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్న గ్లోబల్‌ కంపెనీలకు భారత్‌ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అందువల్లే యాపిల్‌ సంస్థ దేశంలోని చెన్నైలో తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌ ద్వారా ఐఫోన్‌లు తయారుచేస్తోంది. కానీ ప్రస్తుతం అది నిలిచిపోయింది. అందుకుగల కారణాలు ఎంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

తైవాన్ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్‌ యాపిల్ ఐఫోన్లను మన దేశంలోని చెన్నైలో తయారు చేస్తోంది. అయితే తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కంపెనీ తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. అక్కడి పరిస్థితులు ఇంకా కొలిక్కి రాకపోవటంతో ఐఫోన్‌ల నిలిపివేత ఇంకా కొనసాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని సంస్థ వర్గాలు తెలిపాయి.

తమిళనాడు వ్యాప్తంగా మిచౌంగ్ తుపాను వల్ల కురుస్తోన్న కుండపోత వర్షాలతో చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్ వరదల్లో మునిగిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ చెన్నై సమీపంలోని తమ ఫ్యాక్టరీల్లో ఐఫోన్ ఉత్పత్తిని నిలిపివేసాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరుకోవడంతో రవాణాకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. 

ఇదీ చదవండి: తగ్గిన డీజిల్‌ అమ్మకాలు.. కారణం ఇదే..

చైనా నుంచి ఐఫోన్ తయారీని మార్చాలనే క్రమంలో యాపిల్ తన ఉత్పత్తిని 2020లో ఇండియాకు షిఫ్ట్ చేసింది. ఇప్పుడు భారతదేశం ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 7 శాతం వాటాను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కంపెనీ తన ఉత్పత్తిని 25 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ లక్ష్యాన్ని అందుకునే దిశగా కంపెనీ తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 35,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడిచిన రెండో త్రైమాసికం(సెప్టెంబర్‌)లో 25 లక్షల యూనిట్లను తయారుచేసినట్లు తెలిసింది.

#

Tags : 1

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)