Breaking News

16 ఏళ్ల నాటి ఐఫోన్‌ రూ. 1.3 కోట్లు.. దీని ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published on Mon, 07/17/2023 - 21:30

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ధర ఎక్కువైనా కొనేందుకు యువత ఆసక్తి చూపిస్తుంటారు. యూజర్ల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్‌లను యాపిల్‌ సంస్థ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. ప్రస్తుత తాజా మోడల్‌ ఐఫోన్‌ 15 హవా నడుస్తోంది.

అయితే 2007లో విడులైన మొదటి తరం ఐఫోన్‌ తాజాగా జరిగిన వేలంలో రూ. 1.3 కోట్లకు (158,000 డాలర్లు) అమ్ముడుపోయింది.ఇప్పటివరకు వేలంలో అమ్ముడుపోయిన అత్యంత విలువైన ఐఫోన్‌గా ఇది కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ ఐఫోన్‌కు టెక్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ఫోన్‌ రూపొందించడంలో పాలుపంచుకున్న ఇంజనీర్‌లలో ఒకరికి చెందినది.

మొదటి తరం ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్, టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, ఆసక్తికరమైన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను విప్లవాత్మకంగా మార్చారు. కాగా వేలానికి ఉంచిన ఈ ఐఫోన్‌ 16 ఏళ్లయినా ఇప్పటికీ  అంతే కొత్తగా ఉంది. అందుకే వేలంలో అత్యధిక విలువను దక్కించుకుంది.

 ఇదీ చదవండి ➤ మొబైల్‌ నంబర్‌.. మీకు నచ్చినట్టు..

ఈ ఐకానిక్ ఐఫోన్ 4జీబీ వెర్షన్‌ను ఎల్‌సీజీ సంస్థ వేలం వేసింది. 50,000 డాలర్ల నుంచి 100,000 డాలర్లు (రూ.41 లక్షలు నుంచి రూ.82 లక్షలు) మధ్య అమ్ముడుపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా 158,644 డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 1.3 కోట్ల భారీ ధరను దక్కించుకుని కొత్త రికార్డు సృష్టించింది.

వాస్తవానికి 2007లో విడుదలైన మొదటి తరం ఐఫోన్ 4జీబీ వర్షన్‌ ధర కేవలం 499 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 40 వేల కంటే తక్కువే. ఈ ఐఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చిన 16 ఏళ్ల తర్వాత 318 రెట్లు అధిక ధరకు అమ్ముడుపోవడం విశేషం.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)