విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
యాపిల్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
Published on Tue, 09/08/2026 - 14:50
యాపిల్ తన కొత్త ఐఫోన్ 18 సిరీస్‌ను.. సెప్టెంబర్ 9న జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్ అమెరికాలోని కుపర్టినోలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మాత్రమే కాకుండా.. కొత్త యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను కూడా పరిచయం చేయనుంది.
ప్రీ-ఆర్డర్స్ ఎప్పుడంటే?
ఐఫోన్ 18 ప్రో కోసం ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 12న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా.. ఆపిల్ కొత్త ఐఫోన్‌లకు ఈవెంట్ తర్వాత వచ్చే శుక్రవారం ప్రీ-ఆర్డర్లు ప్రారంభిస్తుంది. అయితే.. ఈసారి తేదీలో కొంత మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. ప్రీ-ఆర్డర్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
iOS 27 విడుదల
కొత్త ఐఫోన్‌లతో పాటు iOS 27 కూడా రానుంది. ఇది సెప్టెంబర్ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 18లో ఐఓఎస్ 27 ముందుగానే ఉంటుంది. అలాగే పాత ఐఫోన్‌లలో కూడా ఈ అప్‌డేట్ అందుబాటులోకి రావచ్చు. అప్‌డేట్ విడుదలైన వెంటనే చాలామంది డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయం పట్టవచ్చు.
ఐఫోన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?
ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఫోన్లు.. సెప్టెంబర్ 18న మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. యాపిల్ సెప్టెంబర్ 9న జరిగే ఈవెంట్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్
ఈసారి యాపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది నిజంగా విడుదలైతే యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ధరలు, బుకింగ్‌లకు సంబంధించిన సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది.
Tags : 1