Breaking News

యాపిల్‌ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్‌!

Published on Fri, 09/20/2024 - 12:29

ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్‌ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్‌ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్‌ 20) ఐఫోన్‌ 16 సిరీస్‌ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్‌ అవుట్‌లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్‌గ్లోటైమ్‌’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్‌లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

  • ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్‌ అతిపెద్ద సంస్థ.

  • కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.

  • యాపిల్‌ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.

  • 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.

  • యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్‌ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్‌ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్‌ విలువ 35 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).

ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్‌ కోసం పరుగులు

  • ప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.

  • యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.

  • యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.

  • యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.

  • స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్‌ డాలర్‌(ప్రస్తుతం రూ.83).

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)