Breaking News

బ్యాంకులు.. భలే లాభాలు!

Published on Fri, 10/17/2025 - 18:47

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు ‍బ్యాంకులు ప్రోత్సాహకర ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) 2025–26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 58 శాతం జంప్‌చేసి రూ. 1,226 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 777 కోట్లు మాత్రమే ఆర్జించింది. వడ్డీ ఆదాయం 16 శాతం ఎగసి రూ. 5,856 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 5,055 కోట్ల వడ్డీ ఆదాయం సాధించింది.  స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.72 శాతం నుంచి 1.83 శాతానికి తగ్గాయి.

ఇండియన్‌ బ్యాంక్‌ లాభం ప్లస్‌ 
ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్‌(క్యూ2)లో స్టాండెలోన్‌ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 3,018 కోట్లను తాకింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 2,706 కోట్లు ఆర్జించింది. వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ. 11,964 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 11,125 కోట్ల వడ్డీ ఆదాయం అందుకుంది. మొండి రుణాలకు ప్రొవిజన్లు రూ. 1,099 కోట్ల నుంచి రూ. 739 కోట్లకు తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.48%ం నుంచి 2.6 శాతానికి తగ్గాయి.  

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అప్‌ 
ప్రయివేట్‌ రంగ సంస్థ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో స్టాండెలోన్‌ నికర లాభం 8 శాతం ఎగసి రూ. 351 కోట్లను తాకింది. ప్రొవిజన్లు తగ్గడం లాభించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 325 కోట్లు ఆర్జించింది. నికర  వడ్డీ ఆదాయం 8 శాతం క్షీణతతో రూ. 808 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతం నుంచి 2.8 శాతానికి బలహీనపడ్డాయి. వడ్డీయేతర ఆదాయం 26 శాతం ఎగసి రూ. 516 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 43 శాతం క్షీణించి రూ. 63 కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.4 శాతం నుంచి 2.93 శాతానికి తగ్గాయి. బ్రాంచీల సంఖ్య 948కు చేరింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)