డిజిటల్‌ ఇన్‌ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి 

Published on Mon, 02/17/2025 - 04:29

న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్‌ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్‌కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్‌ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్‌ ఐటీ వర్క్‌తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్‌ మహీంద్రా సీవోవో అతుల్‌ సొనేజా తెలిపారు.  

సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. 
చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్‌ ఇన్‌ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్‌ఏఐ సీఈవో గణేష్‌ గోపాలన్‌ చెప్పారు. సైబర్‌ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్‌ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)