Breaking News

అంతర్జాతీయంగా ‘భారత్‌ బ్రాండ్‌’కు గుర్తింపు

Published on Thu, 10/03/2024 - 05:47

న్యూఢిల్లీ: ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ లేబుల్‌తో అంతర్జాతీయంగా భారత్‌ బ్రాండ్‌కు ప్రచారం తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒక పథకం ప్రకటించే అవకాశం ఉందని, దీనిపై అత్యున్నత స్థాయి కమిటీ పనిచేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. మేడ్‌ ఇన్‌ జపాన్, స్విట్జర్లాండ్‌ మాదిరే మేడ్‌ ఇన్‌ ఇండియాకు బలమైన బ్రాండ్‌ గుర్తింపు తీసుకురావాలన్నది ఇందులోని ఉద్దేశమ్యని తెలిపారు. 

‘‘స్విట్జర్లాండ్‌ గురించి చెప్పగానే వాచీలు, చాక్లెట్లు, బ్యాంకింగ్‌ రంగం గుర్తుకొస్తుంది. ఇదే మాదిరిగా మనం ఏమి చేయగలం అన్న దానిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మనకు మెరుగైన సామర్థ్యాలు కలిగిన టెక్స్‌టైల్స్‌ తదితర కొన్ని రంగాలకే ఈ పథకాన్ని పరిమితం చేయాలా? తదతర అంశాలపై దృష్టి సారించాం’’అని ఆ అధికారి తెలిపారు. భారత్‌ బ్రాండ్‌కు ప్రచారం కల్పించే విషయంలో నాణ్యత కీలక అంశంగా ఉండాలన్నది నిపుణుల సూచన. 

ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలో ‘ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌’ (ఐబీఈఎఫ్‌) ఈ దిశగానే పనిచేస్తోంది. భారత ఉత్పత్తులు, సేవలకు అంతర్జాతీయంగా అవగాహన, ప్రచారం కల్పించడం కోసం కృషి చేస్తుండడం గమనార్హం. ఇప్పుడు భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చే లక్ష్యంతో పథకంపై సమాలోచనలు చేస్తోంది. 

నాణ్యతే ప్రామాణికంగా ఉండాలి.. 
‘‘భారత బ్రాండ్‌ బలోపేతానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. నాణ్యతలో నిలకడ, మన్నిక ప్రాధాన్యంగా ఉండాలి. ఉదాహరణకు అధిక నాణ్యతతో కూడిన జనరిక్‌ ఔషధాల తయారీతో భారత ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ అంతర్జాతీయంగా మంచి నమ్మకాన్ని గెలుచుకుంది’’అని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) పేర్కొంది. భారత్‌ ప్రతిష్ట కాపాడుకునేందుకు నాణ్యతలేని ఉత్పత్తుల సరఫరాకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.   

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)