Breaking News

స్వదేశానికి తిరిగొస్తున్న ప్రవాసులు.. ఎందుకంటే?

Published on Sat, 08/30/2025 - 16:01

ప్రపంచ సాంకేతికత, ఆవిష్కరణలకు కేంద్రమైన సిలికాన్‌ వ్యాలీ నుంచి మల్టి నేషనల్ కంపెనీలు సైబరాబాద్‌ వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తుంటే.. నగరంలో స్థిరాస్తి కొనుగోళ్లు, పెట్టుబడులకు ప్రవాసులూ మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ పెట్టుబడులు సిలికాన్‌ వ్యాలీ నుంచి సైబరాబాద్‌కు వలస వస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో ప్రవాసుల వాటా 30 శాతం వరకు ఉంటుంది. ప్రధానంగా డల్లాస్, బూస్టన్, కాలిఫోర్నియా వంటి నగరాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా ప్రవాసులు ఉంటారు. భౌగోళిక రాజకీయ అస్థిరత, పెరుగుతున్న సుంకాలు, ఉద్యోగ విపణిలో అనిశ్చితులు వంటి అమెరికా, యూరప్‌ దేశాలలో నెలకొన్న అనిశ్చితి వాతావరణం నగర స్థిరాస్తి మార్కెట్‌కు బాగా కలిసి వస్తోంది. ప్రపంచదేశాల్లోని ప్రవాసులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. కేవలం కుటుంబం కోసమే కాదు.. అవకాశాలు, పెట్టుబడుల కోసం కూడా.. ఈ పరివర్తనకు హైదరాబాద్‌ కేంద్రంగా ఉద్భవిస్తోంది. ఏడాది కాలంలోనే ఐదు ప్రధాన అమెరికా ఆధారిత కంపెనీలు ఇండియాలో జీసీసీ కేంద్రాలను ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ.

జీసీసీలకు కేంద్రం..
జీసీసీల విస్తరణ కేవలం సాంకేతికతకు మాత్రమే సంబంధించినది కాదు.. ఇది ప్రతిభ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా సూచిస్తుంది. హైదరాబాద్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ), ఇంటెలెక్చువల్‌ క్యాపిటల్‌గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి హైదరాబాద్‌లో 350కి పైగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) పనిచేస్తున్నాయి. ఫైనాన్షియల్, రిటైల్, క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్స్‌(క్యూఎస్‌ఆర్‌), హెల్త్‌కేర్, టెక్నాలజీ రంగాలలో 3 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎలి లిల్లీ, మెక్‌ డొనాల్డ్స్‌ వంటి కంపెనీలు నగరంలో జీసీసీలను ఏర్పాటు చేశాయి. దేశంలోని 2 వేలకు పైగా జీసీసీలు ఉండగా.. ఇందులో హైదరాబాద్‌ వాటా దాదాపు 15 శాతం.

ప్రవాసులే లక్ష్యంగా..
డెవలపర్లు కూడా ప్రవాసులను లక్ష్యంగా చేసుకొని హైఎండ్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, కోకాపేట్‌ వంటి ప్రాంతాలకు చేరువలోని గేటెడ్‌ కమ్యూనిటీలు, స్మార్ట్‌ హోమ్‌ ప్రాజెక్ట్‌లకు ప్రవాసులకు అనుకూలం. గ్రేడ్‌–ఏ ఆఫీసు స్పేస్, కో–వర్కింగ్‌ హబ్‌లు, డేటా సెంటర్లలో పెట్టుబడులకు బహుళ జాతి సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. చట్టపరమైన డాక్యుమెంటేషన్, ఇంటీరియర్‌ డిజైన్‌ వంటి స్థానిక సేవలను అందించే మధ్యవర్తులు, నాణ్యమైన ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ ఎప్పటికీ ఉంటుంది.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)