Breaking News

భర్త గురించి మనసులో మాట చెప్పిన సుధా మూర్తి, తొలి పరిచయం అలా..

Published on Thu, 05/11/2023 - 08:32

'సుధా మూర్తి' ఈ పేరుకి భారతదేశంలో పరిచయమే అవసరం లేదు, ఎందుకంటే ఒక రచయిత్రిగా, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా మాత్రమే కాకుండా పరోపకారిగా కూడా చాలా మందికి సుపరిచయమే. అయితే ఈమె ఇటీవల తన భర్త నారాయణ మూర్తితో ఏర్పడిన తొలి పరిచయం గురించి ఒక టీవీ షోలో వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇటీవల జరిగిన ఒక ప్రముఖ 'బాలీవుడ్ టాక్ షో'లో సుధా మార్తి పాల్గొన్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గుణీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నారాయణ మూర్తిని మొదటి సారి ఎప్పుడు కలిసారని వ్యాఖ్యాత కపిల్ శర్మ సుధా మూర్తిని అడిగారు.

ఈ సందర్భంలో సుధా మూర్తి తన స్నేహితురాలి ద్వారా నారాయణ మూర్తి పరిచయమయ్యారని చెప్పుకొచ్చారు. ప్రసన్న అనే స్నేహితురాలు రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని, అందులోని ఫస్ట్ పేజీలో నారాయణ మూర్తి పేరు మాత్రమే కాకుండా పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి ప్రదేశాల పేర్లు ఉండేవని చెప్పింది. ఇది చూసినప్పుడు నారాయణ మూర్తి బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అనుకున్నట్లు చెప్పింది.

ఒక రోజు నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లాలని, కలవడానికి ముందు ఆయన సినిమా హీరోలా ఉంటాడని ఊహించినట్లు చెప్పింది. కానీ డోర్ ఓపెన్ చేయగానే ఎవరీ చిన్నపిల్లాడు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇది విన్న అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.

(ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!)

సుధా మూర్తి 44 సంవత్సరాల కిందట నారాయణ మూర్తిని వివాహం చేసుకుంది. వీరికి అక్షతా మూర్తి, రోహన్ మూర్తి అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్షతా మూర్తి భర్త బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. సుధా మూర్తి గొప్ప మానవతా మూర్తి. ఈమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి గొప్ప పురస్కారాలను అందించింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)