Breaking News

రతన్ టాటా జీవితంలో మరిచిపోలేని వ్యక్తి.. ఎవరీ నవాజ్‌బాయి టాటా!

Published on Sat, 09/30/2023 - 17:42

దేశీయ దిగ్గజ సంస్థ టాటా (TATA) గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే ఈ కంపెనీ 1868లో 'జమ్‌సెట్‌జీ నుస్సర్వాన్‌జీ టాటా' (జంషెడ్‌జీ) ప్రారంభించారు. నేడు ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. కంపెనీ మార్కెట్ విలువ నేడు సుమారు రూ. 24 లక్షల కోట్లు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఒకప్పుడు మహిళ డైరెక్టర్‌గా పనిచేసిందని చాలామందికి తెలియకపోవచ్చు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌
1925లో టాటా సన్స్ మొదటి మహిళా డైరెక్టర్‌గా 'నవాజ్‌బాయి' పనిచేసింది. ఆమె తన భర్త రతన్‌జీ టాటా మరణానంతరం కంపెనీకి సారథ్యం వహించి 1965లో మరణించే వరకు దానిని నడిపించింది. కంపెనీని నడిపించడమే కాకుండా ఈమె తన జీవితకాలంలో ఎన్నో దానధర్మాలు చేసింది. దీనికోసం 1928లో ఒక సంస్థను స్థాపించించింది.

ఈ సంస్థ ప్రస్తుతం సర్ రతన్ టాటా ఇన్‌స్టిట్యూట్ (RTI) అనే పేరుతో పేద మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. కుకరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ లాండ్రీ విభాగాలలో వారి స్వంత జీవనోపాధికి శిక్షణ ఇస్తుంది. 

నవాజ్‌బాయి టాటా స్వయంగా రతన్ టాటా గ్రాండ్ మదర్. రతన్ టాటా చిన్నప్పుడు ఈమెతో చాలా సన్నిహితంగా ఉండేవాడినని గతంలో చాలాసార్లు వెల్లడించాడు. రతన్ & నవాజ్‌బాయి టాటా ఇద్దరూ కొన్నేళ్లు ఇంగ్లాండ్‌లో నివసించారు. వీరికి కింగ్ జార్జ్ V అండ్ క్వీన్ మేరీ వ్యక్తిగత స్నేహితులు.

ఇదీ చదవండి: 19 ఏళ్లనాటి కల.. ఇప్పుడు నిజమైంది.. ఈజ్‌మైట్రిప్‌ కో-ఫౌండర్

టాటా సంస్థ పురోగతికి నవాజ్‌బాయి ఎంతో కృషి చేసింది. జమ్‌సెట్‌జీ టాటా నిర్దేశించిన సూత్రాలు, ఆదర్శాలకు అనుగుణంగా కంపెనీ పనిచేస్తుందని ఆమె నిర్ధారించేవారు. ఈ సంఘటనలు రతన్ టాటా గతంలో కూడా చాలా గొప్పగా వెల్లడించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)