Breaking News

రెండు సార్లు ‘మరణం’!! రూ.1.1 కోట్ల కోసం మహిళ మోసం

Published on Sun, 06/30/2024 - 11:05

ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు తమ కుటుంబానికి ఆదరవుగా ఉంటుందని బీమా చేయిస్తుంటారు. కానీ బీమా సొమ్ము కోసమే చనిపోయినట్లు అదికూడా రెండు సార్లు మరణించినట్లు మోసగించిన ఉదంతం ముంబైలో బయటపడింది.

ముంబై ప్రాంతంలోని భయాందర్‌కు చెందిన 45 ఏళ్ల మహిళ కంచన్ పాయ్ అలియాస్‌ పవిత్ర రూ.1.1 కోట్ల ఇన్సూరెన్స్ రెండేళ్లలో రెండుసార్లు తన మరణాన్ని ఫేక్ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే రూ.70 లక్షలను నిందితురాలి కుటుంబం అందుకుంది.

కంచన్‌ పాయ్‌ భర్త, కుమారుడు 2021-2023 మధ్య ఐదు ప్రైవేట్ రంగ బీమా కంపెనీల నుంచి రూ .1.1 కోట్లు క్లెయిమ్‌ చేశారు. వారికి ఇప్పటికే డెత్ క్లెయిమ్ రూపంలో దాదాపు రూ.70 లక్షలు వచ్చాయి. మిగిలిన మొత్తం కోసం ఎదురు చూస్తుండగా మోసం బయటపడింది. ముగ్గురూ పరారీలో ఉన్నారు.

అశుతోష్ యాదవ్ అనే వైద్యుడి సాయంతో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు, దహన సంస్కారాల రశీదులు పొంది ఈ మోసానికి పాల్పడ్డారు. ఈ డాక్టర్‌ కూడా పరారీలో ఉన్నాడు. కంచన్ అలియాస్ పవిత్ర రెండు వేర్వేరు ఆధార్ కార్డు, పాన్ కార్డులను ఉపయోగించి మొత్తం ఐదు ప్రైవేటు సంస్థల నుంచి బీమా పాలసీలు తీసుకున్నట్లు విచారణలో తేలింది.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు