Breaking News

ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి..

Published on Fri, 09/05/2025 - 04:51

జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పరిశ్రమ తప్పకుండా వినియోగదారులకు అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ సూచించారు. స్వాతంత్య్రం తర్వాత చేపట్టిన అతిపెద్ద, విప్లవాత్మక సంస్కరణగా దీన్ని అభివరి్ణస్తూ, ప్రధాని మోదీకి ఈ ఘనతను ఆపాదించారు. అన్ని రంగాల్లోనూ డిమాండ్‌కు ఊతమిస్తుందన్నారు. భారత్‌లో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలని పరిశ్రమను కోరారు. 

ఫార్మా, హెల్త్‌కేర్‌కు సంబంధించి 11 అంతర్జాతీయ ప్రదర్శన (ఇండియా మెడ్‌టెక్‌ ఎక్స్‌పో 2025, ఐఫెక్స్‌ 2025)ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్‌టీలో తీసుకొచి్చన సంస్కరణలు రైతుల నుంచి ఎంఎస్‌ఎంఈల వరకు.. ఫార్మా రంగంతోపాటు మరెన్నో రంగాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు సహకరిస్తుందన్నారు. వచ్చే రెండేళ్లలో భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ.. 4 ట్రిలియన్‌ డాలర్ల పరిమాణం నుంచి 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి బలపడుతుందని చెప్పారు.

పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఊతం.. 
‘జీఎస్‌టీ తగ్గింపు మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించినప్పుడే పరిశ్రమకు పూర్తిస్థాయిలో ప్రయోజనం దక్కుతుంది. రేట్లు తగ్గడం సహజంగానే వినియోగాన్ని పెంచుతుంది. డిమాండ్‌కు   ఊతంతో పెద్ద ఎత్తున పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు, వృద్ధికి దారితీస్తుంది’ అని మంత్రి చెప్పారు.

సాఫీగా మారేలా చూస్తాం: సీబీఐసీ చైర్మన్‌  
జీఎస్‌టీలో ప్రతిపాదిత కొత్త శ్లాబులకు సాఫీగా మారేందుకు వీలుగా, సెపె్టంబర్‌ 22 నాటికి టెక్నాలజీని సిద్ధం చేస్తామని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. రిటర్నుల దాఖలుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ విషయమై పరిశ్రమతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)