Breaking News

తయారీ లక్ష్యానికి పారిశ్రామిక ఎలక్ట్రానిక్స్‌ దన్ను

Published on Tue, 08/05/2025 - 05:48

న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్‌ తయారీని ప్రోత్సహించడంపై మరింతగా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) కోరింది. 2030–31 నాటికి 500 బిలియన్‌ డాలర్ల ఎల్రక్టానిక్స్‌ తయారీ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. 

కేవలం ప్రోడక్టుల తయారీకే పరిమితం కాకుండా ఫ్యాక్టరీలు, నగరాలు, రవాణా నెట్‌వర్క్‌లు మొదలైన వాటిని ఆటోమేట్‌ చేసేందుకు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేస్తే ఎల్రక్టానిక్స్‌ పరిశ్రమకు భవిష్యత్తు ఉంటుందని వివరించింది. 

ఈ నేపథ్యంలో ఇండ్రస్టియల్‌ ఎలక్ట్రానిక్స్‌ సెగ్మెంట్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాలని ఐసీఈఏ చైర్మన్‌ పంకజ్‌ మహీంద్రూ తెలిపారు. ’ప్రతి అధునాతన తయారీ సెటప్‌కి ఇది మెదడు, నాడీమండలం లాంటిది. తయారీ రంగంలో భారత్‌ అగ్రస్థానానికి చేరుకోవాలంటే, పారిశ్రామిక ఆటోమేషన్‌లో అగ్రగామిగా ఎదగాల్సి ఉంటుంది’ అని ఆయన చెప్పారు.

భారీగా ఉద్యోగావకాశాలు.. 
పారిశ్రామిక ఎల్రక్టానిక్స్‌ సెగ్మెంట్‌కి సంబంధించి ఎంబెడెడ్‌ సిస్టమ్స్, ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్, రోబోటిక్స్, ఏఐ ఆధారిత సిస్టమ్స్‌ మొదలైన విభాగాల్లో నిపుణులకు భారీగా ఉద్యోగావకాశాలు ఉంటాయని మహీంద్రూ చెప్పారు. ఈ విభాగం మరింతగా అభివృద్ధి చెందేలా నిపుణులను తీర్చిదిద్దడంపై, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలపై ఇన్వెస్ట్‌ చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

 ఆధునిక తయారీ మౌలిక సదుపాయాల కల్పనకు ఇండస్ట్రియల్‌ ఎల్రక్టానిక్స్‌ సాంకేతికంగా వెన్నెముకలాంటిదని డెల్టా ఎల్రక్టానిక్స్‌ వీపీ మనీష్‌ వాలియా తెలిపారు. స్మార్ట్‌ ఫ్యాక్టరీలు, రోబోటిక్స్, ఇంటెలిజెంట్‌ గ్రిడ్స్, ఆటోమేటెడ్‌ సిస్టమ్స్, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు ఉండే రవాణా, లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లకు ఇది దన్నుగా నిలుస్తుందని వివరించారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)