Breaking News

పీఎల్‌ఐ పథకంలో రిలయన్స్‌

Published on Wed, 03/29/2023 - 00:53

న్యూఢిల్లీ: సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ తయారీ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ ప్రకటిత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం రెండో దశలో 11 కంపెనీలకు చోటు లభించింది. వీటిలో రిలయన్స్, ఫస్ట్‌ సోలార్, ఇండోసోల్‌ తదితరాలున్నాయి. మొత్తం 39,600 మెగావాట్ల సామర్థ్యంగల ప్రాజెక్టులను ప్రభుత్వం కేటాయించింది. పథకంలో భాగంగా ఇందుకు రూ. 14,007 కోట్లు వెచ్చించనుంది. అత్యధిక సామర్థ్యంగల సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ రెండో దశలో భాగంగా విద్యుత్‌ శాఖ తాజా ప్రాజెక్టులను కేటాయించింది.

వీటిలో 7,400 మెగావాట్లు 2024 అక్టోబర్‌కల్లా ప్రారంభంకావచ్చని అంచనా. ఈ బాటలో 2025 ఏప్రిల్‌కల్లా 16,800 మెగావాట్లు, 2026 ఏప్రిల్‌కు మరో 15,400 మెగావాట్లు సిద్ధంకానున్నట్లు అంచనా. వెరసి రెండో దశలో భాగంగా మొత్తం రూ. 93,041 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి. అంతేకాకుండా 1,01,487 ఉద్యోగాల సృష్టికి అవకాశముంది. వీటిలో 35,010 ఉద్యోగాలు ప్రత్యక్షంగా, 66,477 పరోక్షంగా లభించే వీలుంది.  

కంపెనీల వివరాలు
పాలీసిలికాన్, ఇన్‌గాట్‌ వేఫర్స్, సోలార్‌ సెల్స్, మాడ్యూల్‌ బాస్కెట్‌లో రిలయన్స్, ఇండోసోల్‌ విడిగా 6,000 మెగావాట్ల చొప్పున ప్రాజెక్టులను పొందాయి. ఈ బాటలో ఫస్ట్‌ సోలార్‌ 3,400 మెగావాట్లను పొందింది. వేఫర్స్, సోలార్‌ సెల్స్, మాడ్యూల్స్‌ బాస్కెట్‌లో వారీ 6,000 మెగావాట్లు, రీన్యూ 4,800 మెగావాట్లు, అవాడా 3,000 మెగావాట్లు, గ్రూ 2,000 మెగావాట్లు, జేఎస్‌డబ్ల్యూ 1,000 మెగావాట్ల ప్రాజెక్టులు పొందాయి. ఇక సోలార్‌ సెల్స్, మాడ్యూల్స్‌లో టాటా పవర్‌ సోలార్‌ 4,000 మెగావాట్లు, విక్రమ్‌ 2,400 మెగావాట్లు, యాంపిన్‌ 1,000 మెగావాట్లు చొప్పున ప్రాజెక్టులు అందుకున్నాయి.

హైటెక్నాలజీతో..
హై టెక్నాలజీ సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ తయారీ వేల్యూ చైన్‌లో దేశం బలపడుతున్నట్లు పీఎల్‌ఐ పథ కం విజయంపై స్పందిస్తూ విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. తాజా సామర్థ్య విస్తరణ ద్వారా సోలార్‌ తయారీ రంగంలో దేశం స్వావలంబన దిశగా భారీ అడుగులు వేస్తున్నట్లు తెలియజేశా రు. కాగా.. పథకం తొలి దశలో భాగంగా 2022 నవంబర్‌–డిసెంబర్‌లో  8,737 మెగావాట్ల సమీకృత సామర్థ్య ప్రాజెక్టులను కేటాయించింది. వెరసి పీ ఎల్‌ఐ పథకం రెండు దశల్లో కలిపి మొత్తం 48,337 మెగావాట్ల ప్రాజెక్టులు కేటాయించింది. రూ. 18,500 కోట్లకుపైగా ఆర్థిక మద్దతు ప్రకటించింది.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)