Breaking News

ఐపీవోకు ఇందిరా ఐవీఎఫ్‌ నో

Published on Wed, 03/26/2025 - 01:42

న్యూఢిల్లీ: ఫెర్టిలిటీ క్లినిక్‌ చైన్‌ ఇందిరా ఐవీఎఫ్‌ హాస్పిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలను పక్కనపెట్టింది. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. కంపెనీ ఇంతక్రితం గోప్యతా మార్గంలో ఐపీవో చేపట్టేందుకు సెబీకి ముందస్తు దరఖాస్తు చేసింది. రహస్య ఫైలింగ్‌ చేసిన కంపెనీ సంబంధిత వివరాలను గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. అంతేకాకుండా కచ్చితంగా పబ్లిక్‌ ఇష్యూ చేపట్టాలన్న నిబంధనలేమీ లేవు. ఫిబ్రవరి 13న సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన కంపెనీ కారణాలు వెల్లడించకుండా ఈ నెల 19న ఉపసంహరించుకుంది. 

ఇంతక్రితం 2023లో హోటళ్ల అగ్రిగేటర్‌ ఓయో సెబీకి రహస్య ఫైలింగ్‌ చేసినప్పటికీ ఐపీవో చేపట్టలేదు. అయితే 2024లో రిటైల్‌ దిగ్గజం విశాల్‌ మెగామార్ట్, ఫుడ్‌ డెలివరీ దిగ్గజం స్విగ్గీ ఐపీవోలు చేపట్టి స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యాయి. ఈ బాటలో గత వారం ఫిజిక్స్‌వాలా సైతం కాన్ఫిడెన్షియల్‌ రూట్‌లో సెబీకి పత్రాలు దాఖలు చేసింది. కాగా.. 2022 డిసెంబర్‌లో టాటా ప్లే(గతంలో టాటా స్కై) దేశీయంగా తొలిసారి రహస్య ఫైలింగ్‌ రూట్‌లో సెబీకి దరఖాస్తు చేసింది. 2023 ఏప్రిల్‌లో అనుమతి పొందినప్పటికీ ఐపీవోకు రాకపోవడం గమనార్హం!  

అగ్రివేర్‌హౌసింగ్‌కు చెక్‌ 
అగ్రివేర్‌హౌసింగ్‌ అండ్‌ కొలేటరల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ 2024 డిసెంబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. టెక్నాలజీ ఆధారిత అగ్రికల్చర్‌ సర్విసులందించే కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయాలని భావించింది. వీటికి జతగా మరో 2.69 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేసింది. వాటాదారుల్లో టెమాసెక్‌ 1.19 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయనుంది. సాధారణ ఫైలింగ్‌ చేస్తే సెబీ అనుమతి పొందిన 12 నెలల్లోగా ఐపీవో చేపట్టవలసి ఉంటుంది. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)