Breaking News

ఇండిగో విమానం.. ఎగరక ముందే వణికించింది!

Published on Mon, 12/08/2025 - 12:54

దేశవ్యాప్తంగా విమానాల జాప్యాలు, రద్దులతో విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ తరుణంలో ఇండిగో విమానంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటన ప్రయాణికులను వణికించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బెంగళూరు–వడోదర మార్గంలో ఉన్న ఇండిగో విమానం టేకాఫ్‌కి సిద్ధమవుతున్న సమయంలో ఒక పావురం అకస్మాత్తుగా క్యాబిన్‌లోకి ప్రవేశించింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కొద్దిసేపు గందరగోళానికి గురయ్యారు.

వైరల్ వీడియోలో, పావురం విమానం నుండి బయటపడటానికి ప్రయత్నిస్తూనే ప్రయాణికుల తలల మీదుగా ఎగురుతూ కనిపిస్తుంది. సిబ్బంది, కొంతమంది ప్రయాణికులు దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించినా పావురం విమానం లోపలే తిరుగుతూనే ఉంది. ఈ దృశ్యాన్ని ఒక డిజిటల్ క్రియేటర్ రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఆ వీడియో వెంటనే వైరల్ అయింది. “విమానంలో ఆశ్చర్యకర అతిథి… నవ్వుల నడుమ సరదా క్షణం. పూర్తిగా ఆనందించాను” అని తన పోస్టులో పేర్కొన్నారు.

వైరల్‌ అయిన ఈ ఘటన సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంది. పలువరు తమ కామెంట్లతో స్పందించారు.  “అది బర్డింగ్ పాస్  తీసుకుందేమో!” అని ఒకరు హాస్యభరితంగా వ్యాఖ్యానించగా “ప్రయాణంలో  అదనపు తోడు” అని కామెంట్‌ చేశారు. “ఇండిగో టైమ్‌ ఇటీవల అస్సలు బాలేదు” అని మరొకరు ప్రతిస్పందించారు.

ఇండిగో ఈ ఘటనపై అధికారికంగా స్పందించకపోయినా, వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Videos

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)