2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా    

Published on Tue, 04/25/2023 - 12:13

ముంబై: భారత్‌లో రుణ వృద్ధి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితం కావచ్చని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ-నోమురా అంచనా వేసింది. 2022-23లో సాధించిన 15 శాతంతో పోల్చిచూస్తే రుణ స్పీడ్‌ దాదాపు 5 శాతం పడిపోతు దన్నది నోమురా అంచనాలు కావడం గమనార్హం. ఆహారేతర రుణాలకు సంబంధించి వృద్ధి మందగించే అవకాశం ఉందని ఈ మేరకు విడుదల చేసిన నివేదికలో సంస్థ అభిప్రాయపడింది.

(ఇదీ చదవండి: బేబీ షవర్‌: ఉపాసన పింక్‌ డ్రెస్‌ బ్రాండ్‌, ధర ఎంతో తెలుసా?)

రుణ వృద్ధి స్పీడ్‌ తగ్గడంసహా, ద్రవ్యోల్బణం ఒత్తిడులు, తక్కువ మూలధన అవసరాలు వంటి కారణాలు 2023-24లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రేటును 5.3 శాతానికి పరిమితం చేస్తాయని కూడా నోమురా అంచనా వేయడం గమనార్హం. గత ఏడాది మే నుంచి 2.5 శాతం మేర పెరిగిన ఆర్‌బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు-ప్రస్తుతం 6.5 శాతం) రుణ వృద్ధికి విఘాతం కలిగించే వీలుందని, వ్యవస్థలో ప్రత్యేకించి గృహ రుణాలపై ఇప్పటికే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషించింది. (డిజిటల్‌ బాటలో ఎయిర్‌ ఇండియా - భారీ పెట్టుబడి)

జనవరిలో 16.7 శాతం రుణ వృద్ధి నమోదయితే.. ఇది తగ్గుతూ వస్తున్న ధోరణి స్పష్టమవుతోందని పేర్కొంది.  ఫిబ్రవరిలో 16 శాతం, మార్చిలో 15.4 శాతంగా రుణ వృద్ధి జరిగిందని పేర్కొంది. రానున్న మాసాల్లో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రుణ వృద్ధి పెంచుకోవవడం-సాధ్యమైనంత మొండిబకాయిలు (ఎన్‌పీఏ) తగ్గించుకోవడంపై భారత్‌ బ్యాంకింగ్‌ ప్రస్తుతం దృష్టి సారించినట్లు పరిస్థితి కనబడుతోందని పేర్కొంది.  (శ్యామ్‌ స్టీల్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)