షూతో తన్నుతూ.. నా భార్య ముందే బూతులు తిడుతూ..
Breaking News
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
Published on Sun, 04/12/2026 - 08:45
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.
ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
Tags : 1