Breaking News

రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీ ఇస్తున్న ‘ఫ్లెక్స్ ఆఫీస్’

Published on Wed, 04/01/2026 - 16:34

దేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ (ఫ్లెక్స్ ఆఫీస్) పరిశ్రమ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. దేశంలో ఈ రంగం ఇప్పటికే 100 మిలియన్ చదరపు అడుగుల మార్కును దాటడమే కాకుండా, లాభాల బాటలో పయనిస్తూ సరికొత్త వృద్ధి దశలోకి ప్రవేశించింది. అనరాక్‌ ‍గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ మార్కెట్‌ప్లేస్‌ ‘మైహెచ్‌క్యూ’(myHQ) విడుదల చేసిన క్యూ3 (Q3 FY26) ఫ్లెక్స్ ఆఫీస్ నివేదిక ప్రకారం.. 2028 నాటికి ఈ రంగం విలువ ఏకంగా 9 నుండి 10 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

ఒకప్పుడు కేవలం స్టార్టప్‌లకే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs), బడా కార్పొరేట్ సంస్థల రాకతో సరికొత్త రూపును సంతరించుకుంది. కొత్తగా బుక్ అవుతున్న సీట్లలో దాదాపు 40% వాటాను ఇవే కైవసం చేసుకుంటున్నాయి. గత రెండేళ్లలో సగటు డీల్ సైజు 25 సీట్ల నుండి ఏకంగా 53 సీట్లకు పెరగడం విశేషం. దీన్నిబట్టి ప్రధాన స్రవంతి రియల్ ఎస్టేట్ వ్యూహాల్లో ఫ్లెక్స్ ఆఫీస్‌ల ప్రాధాన్యత ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

లాభాల బాటలో దిగ్గజాలు
ఈ రంగంలో 2026 ఆర్థికేడాదిలోని మూడో త్రైమాసికం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. మార్కెట్లోని పలు అగ్రగామి లిస్టెడ్ ఆపరేటర్లు ఒకేసారి లాభాల్లోకి రావడం విశేషం. 'వీవర్క్ ఇండియా' (WeWork India), 'స్మార్ట్‌వర్క్స్' (Smartworks) రెండు సంస్థలూ లాభాలు ఆర్జించాయి. ఇందులో 'స్మార్ట్‌వర్క్స్' అత్యధికంగా 490 బేసిస్ పాయింట్ల మార్జిన్ వృద్ధిని నమోదు చేసి రికార్డు సృష్టించింది.

వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే..

కార్పొరేట్ సంస్థల మొగ్గు: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) సంస్థలు ఈ ఆఫీస్‌లను ఎక్కువగా ఎంచుకుంటుండటంతో పరిశ్రమకు దీర్ఘకాలిక స్థిరత్వం లభిస్తోంది.

ఆదాయ వనరుల వైవిధ్యం: కేవలం ఆఫీస్ స్పేస్‌పైనే కాకుండా.. MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, కాన్ఫరెన్స్‌లు, ఎగ్జిబిషన్లు), డే పాస్‌లు, ప్రైవేట్ క్యాబిన్లు, ఇతర విలువ ఆధారిత సేవల ద్వారా ఆపరేటర్లు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మొత్తం ఆదాయంలో వీటి వాటా 12-16% గా ఉంది.

ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరణ: బెంగళూరులోని సర్జాపూర్, హెబ్బాల్, హైదరాబాద్‌లోని కోకాపేట, పూణేలోని హింజేవాడి, చెన్నైలోని ఓఎంఆర్‌వంటి మెట్రో ప్రాంతాలతో పాటు.. అహ్మదాబాద్, కొచ్చి, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు కూడా ఇప్పుడు ప్రధాన హబ్‌లుగా మారుతున్నాయి.

భారీ పెట్టుబడులు: గ్లోబల్ ఫండ్స్ రాక, ఐపీఓ (IPO)ల ద్వారా నిధుల సమీకరణ ఈ రంగం మరింత వేగంగా విస్తరించడానికి దోహదం చేస్తున్నాయి.

సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు గట్టి పోటీ
ఈ పరిణామాలపై మైహెచ్‌క్యూ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉత్కర్ష్ కవాత్రా మాట్లాడుతూ.. ‘ఫ్లెక్స్ ఆపరేటర్లు ఇప్పుడు కేవలం తమలో తాము మాత్రమే పోటీ పడటం లేదు. సంప్రదాయ కమర్షియల్ రియల్ ఎస్టేట్‌తో తలపడుతూ.. ఫ్లెక్సిబులిటీ, వేగం, మూలధన సామర్థ్యంతో విజయం సాధిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

అజిత్ దోవల్ రెడ్ ఫైల్ లో ఏముంది? యుద్ధానికి సిద్ధమవుతున్న ఇండియా!

పెద్ది రిలీజ్ పై స్వయంగా క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్

ఆ లాఠీతో కొట్టడం ఏంటండీ.. హర్ష వీణ దాడిపై కారుమూరి వెంకట్ రెడ్డి రియాక్షన్

అమెరికా రాజకీయాల్లో మరో సంచలనం

నన్ను రక్తం వచ్చేలా కొట్టారు.. అసలు ఏం జరిగిందంటే..

కమ్మ రాజధాని.! బాబు సైలెంట్..

జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు

అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణపై దాడి.. CCTV వీడియో

విజయ్ కింగా..? కింగ్ మేకరా..?

పేర్ని కిట్టుపై అక్రమ కేసు

Photos

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)