Breaking News

86శాతం తగ్గిన ధరావతు సొమ్ము.. స్పెక్ట్రమ్‌ అంటే..?

Published on Fri, 05/24/2024 - 11:43

నెట్‌వర్క్‌ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల వేలంలో కంపెనీలు సమర్పించిన ధరావతు సొమ్ము(ఈర్నెస్ట్‌ మనీ డిపాజిట్లు-ఈఎండీ) 2022 కంటే సుమారు 86శాతం తక్కువగా ఉందని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.

తాజా కథనాల ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు సమర్పించిన ఈఎండీ రూ.300-రూ.3,000 కోట్లుగా ఉంది. గత పదేళ్లలో అత్యల్ప ఈఎండీ నమోదవడం ఇదే తొలిసారి. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు సమర్పించిన ఈఎండీల కంటే ఇది దాదాపు 79-86% తక్కువగా ఉంది.

స్పెక్ట్రమ్‌లో ఈఎండీలు బిడ్డింగ్ వ్యూహాన్ని, కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఆక్షన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హత పాయింట్లను ఈఎండీల ద్వారా పొందవచ్చు. ఈసారి దాదాపు రూ.97,000 కోట్ల (దాదాపు 12 బిలియన్లు డాలర్లు) విలువైన 5జీ ఎయిర్‌వేవ్‌లలో ప్రభుత్వం 21% స్పెక్ట్రమ్‌ను అమ్మే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్‌ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందుతుంటారు. తర్వాత ఆక్షన్‌లో పాల్గొని స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంటారు.

  • రిలయన్స్‌ జియో 2022లో ఈఎండీలు రూ.14000 కోట్లు, ఈసారి రూ.3000 కోట్లు.

  • భారతీఎయిర్‌టెల్‌ 2022లో ఈఎండీలు రూ.5500 కోట్లు, ఈసారి రూ.1050 కోట్లు.

  • వొడాఫోన్‌ ఐడియా 2022లో ఈఎండీలు రూ.2200 కోట్లు, ఈసారి రూ.300 కోట్లు.

స్పెక్ట్రమ్‌ అంటే?

సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్‌ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్‌ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు.

ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి

గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్‌ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)