Breaking News

ఏసీ రైలు ఎక్కేవారికి.. ఇది ఎప్పుడూ గందరగోళమే!!

Published on Sun, 07/19/2026 - 13:03

రైలు ప్రయాణంలో స్లీపర్, 3ఏసీ (3AC), 2ఏసీ (2AC), ఫస్ట్ ఏసీ (1AC) వంటి కోచ్‌ల గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. అయితే కొన్ని రైళ్లలో కనిపించే 'AB'అనే కోచ్ గుర్తు మాత్రం ప్రయాణికులను తరచూ అయోమయానికి గురి చేస్తుంది. ఇది ప్రత్యేక కోచ్ కాదని, 2ఏసీ, 3ఏసీ విభాగాలను ఒకే కోచ్‌లో కలిపిన కాంబినేషన్ కోచ్ అని భారతీయ రైల్వే చెబుతోంది.

భారతీయ రైల్వేలో సాధారణంగా స్లీపర్ కోచ్‌లకు 'S', థర్డ్ ఏసీకి 'B', సెకండ్ ఏసీకి 'A' అనే కోడ్‌లు ఉంటాయి. అయితే కొన్ని రైళ్లలో ప్రయాణికుల డిమాండ్, కోచ్‌ల అందుబాటు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 'AB' కోచ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక భాగం 2ఏసీ ప్రయాణికులకు, మరో భాగం 3ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు.

ఒకే బెర్త్ నంబర్ రెండు చోట్ల..

AB కోచ్‌లో ఎక్కువగా గందరగోళం సృష్టించే అంశం బెర్త్ నంబర్లే. ఉదాహరణకు బెర్త్ నంబర్ 3 ఒకటి 2ఏసీ విభాగంలో ఉండగా, మరో బెర్త్ నంబర్ 3, 3ఏసీ విభాగంలో కూడా ఉండొచ్చు. అందువల్ల ప్రయాణికులు బెర్త్ నంబర్‌తో పాటు టికెట్‌లో పేర్కొన్న క్లాస్ (2AC లేదా 3AC)ను తప్పనిసరిగా పరిశీలించాలి.

మీ సీటును ఎలా గుర్తించాలి?

టికెట్‌లో 2AC అని ఉంటే కోచ్‌లోని 2ఏసీ విభాగానికే వెళ్లాలి. అక్కడ దిగువ, ఎగువ బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. మిడిల్ బెర్త్ ఉండదు. అదే 3AC టికెట్ అయితే 3ఏసీ భాగంలో సీటు ఉంటుంది. అక్కడ సాధారణంగా దిగువ, మధ్య, ఎగువ బెర్త్‌లతో పాటు సైడ్ బెర్త్‌లు ఉంటాయి.

కోచ్‌ను చూసి కూడా గుర్తించొచ్చు

2ఏసీ విభాగంలో ఎక్కువ ప్రైవసీ కోసం బెర్త్‌లకు కర్టెన్లు (కొన్ని రైళ్లలో రైల్వే నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంటే) లేదా ప్రత్యేక విభజన ఉంటుంది. 3ఏసీ భాగంలో మాత్రం ఓపెన్ బే తరహా అమరిక కనిపిస్తుంది. దీంతో కోచ్‌లోకి వెళ్లిన వెంటనే ఏ విభాగంలో ఉన్నారో గుర్తించడం సులభమవుతుంది.

టికెట్‌లో కోచ్ నంబర్, క్లాస్, బెర్త్ వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సందేహం వస్తే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) లేదా కోచ్ అటెండెంట్‌ను సంప్రదించడం మంచిది. దీంతో తప్పు సీటులో కూర్చోవడం, ఇతర ప్రయాణికులతో అనవసర ఇబ్బందులు ఎదురుకావడం వంటి సమస్యలను నివారించవచ్చు.

అయితే అన్ని రైళ్లలోనూ ఈ AB కోచ్ ఉండదు. ప్రయాణికుల డిమాండ్, రైలు రేక్ అమరిక (Coach Composition) ఆధారంగా మాత్రమే భారతీయ రైల్వే ఇలాంటి కాంబినేషన్ కోచ్‌లను ఉపయోగిస్తుంది. అందువల్ల టికెట్‌లో క్లాస్, కోచ్, బెర్త్ వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం సురక్షితమైన ప్రయాణానికి కీలకం.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)